AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Mistakes: ఆహారం విషయంలో ఈ 3 తప్పులు అస్సలు చేయకండి..

Health Mistakes: దేశంలో అంతకంతకు పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసుల వల్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Health Mistakes: ఆహారం విషయంలో ఈ 3 తప్పులు అస్సలు చేయకండి..
uppula Raju
|

Updated on: Jan 03, 2022 | 4:18 PM

Share

Health Mistakes: దేశంలో అంతకంతకు పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసుల వల్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఎందుకంటే రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే కరోనా వైరస్‌ని ఎదుర్కోగలం. కరోనా మహమ్మారి వల్ల ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమైనదో అందరికి తెలిసివచ్చింది. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరు కచ్చితమైన డైట్‌ పాటించాలి. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ మూడు తప్పులు అస్సలు చేయకూడదు. వాటి గురించి తెలుసుకుందాం.

ఫ్యాష‌న్ డైట్‌ల జోలికి పోకండి వాస్తవానికి కాలక్రమేణా ఆహారం పోకడలు కూడా మారుతూ ఉంటాయి. అయితే పోషకాహారం విషయంలో కొన్ని ఆహారాలు ఎప్పటికి మారవు. అవే మిమ్మల్ని దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాంటి ఆహరాలు చాలా ఉన్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్యాషన్ డైట్‌ల జోలికి పోకండి. ఫ్యాకేజ్‌ ఫుడ్స్‌కి స్వస్తి చెప్పండి. మసాలా, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. మొక్కల ఆహారాలు ఎక్కువగా తినండి. సరైన రీతిలో నీరు తాగండి. మంచి ఫలితాలు ఉంటాయి.

సంప్రదాయ ఆహారాలు వాస్తవానికి మన ప్రాచీనులు ఆహారంలో నెయ్యి చేర్చుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజలు కాఫీలో కూడా నెయ్యి వేసుకొని తాగుతున్నారు. గతంలో చపాతీలకు నెయ్యి వాడేవారు కాదు కానీ ఇప్పుడు నెయ్యి లేకుండా చపాతీలు చేయడం లేదు. ప్రజలు ఈ విధంగా అలవాటు పడ్డారు. అయితే ఈ పద్దతులు అందరికి సెట్ కావు. ఎవరికి ఏది అవసరమో అదే తీసుకోవాలి. సంప్రదాయ ఆహారాలు ఎల్లప్పుడు ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

వ్యాయామాన్ని శిక్షగా చేయవద్దు వ్యాయామం మన జీవితంలో అంతర్భాగం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. లావుగా ఉన్నవారికి వ్యాయామం అనేది ఒక శిక్ష కాదు. వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది యాంటిడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. మీ కోరికలను, ఒత్తిడిని తగ్గిస్తుంది. మహిళలు ఫిట్‌నెస్‌ విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు.చాలామంది మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత జుట్టు రాలడం, PCOS, బలహీనమైన మోకాళ్లు, వెన్నునొప్పి, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు, కెరీర్, కుటుంబం, సామాజిక ఒత్తిడి వంటి బాధ్యతల కారణంగా చాలా మంది మహిళలు ఫిట్‌నెస్ కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అందుకే వారు ఊబకాయం బారిన పడుతున్నారు. కాబట్టి కచ్చితంగా మహిళలు వ్యాయామానికి సమయం కేటాయించాలి.

Deepthi Sunaina: లైవ్‌లో కన్నీళ్లు పెట్టిన దీప్తి.. హృదయం ముక్కలైన ఎమోజీలు పెట్టిన షణ్ముక్

Railway Jobs: నార్తర్న్‌ రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటాలో అభ్యర్థుల ఎంపిక.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Vijayashanthi: టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్లాయి.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు