బీజేపీ నేతలను సైతం కరీంనగర్ వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డ విజయశాంతి.. ఫోన్లు లాక్కుంటున్నారు.. మీ మీటింగ్‌లకి కరోనా ఉండదా అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ మీటింగ్‌లకు కరోనా ఉంటాదా..?. టీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. ప్రజల తప్పుదారి పట్టించేందుకే బీజేపీ దీక్ష చేసిన రోజే కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. బండి సంజయ్ సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్న విజయశాంతి.. మహిళల చీరలు లాగారు. కార్యకర్తలను లాఠీలతో కొట్టారని ఆరోపించారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలతో అందరూ బయటకు వస్తున్నారు. సమస్యలను పక్క దారి పట్టిస్తున్నారు. బండి సంజయ్‌తో పాటు, కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో ఎవరు సంతోషంగా లేరు.. రాష్ట్రం చావుల తెలంగాణగా మారింది.. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్లాయి.. కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది’’ అని .. విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.