చలికాలంలో బెల్లం ఎక్కువగా తింటున్నారా..! జాగ్రత్త ఈ సమస్యలు వచ్చే అవకాశం..
Jaggery Side Effects: చలికాలంలో బెల్లం తినాలని చాలామంది సలహా ఇస్తారు. బెల్లం తినడం వల్ల చాలా రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు
Jaggery Side Effects: చలికాలంలో బెల్లం తినాలని చాలామంది సలహా ఇస్తారు. బెల్లం తినడం వల్ల చాలా రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతారు. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్‌లో బెల్లం దానితో తయారు చేసిన వస్తువులను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే బెల్లం ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని అతి పెద్ద లక్షణం ఏంటంటే ఇది చక్కెర మాదిరి శుద్ధి చేయబడదు. అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒక్కోసారి బెల్లం ఆరోగ్యానికి హానికరం అవుతుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
1. అజీర్ణం అన్నం తిన్న తర్వాత బెల్లం తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. ఇది నిజమే దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కానీ బెల్లం ఎక్కువగా తినడం వల్ల పొట్టకి సంబంధించిన అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి. దీని కారణంగా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది.
2. బరువు పెరుగుతారు బెల్లం పంచదార లాగా హాని చేయదు కానీ అధిక వినియోగం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. 10 గ్రాముల బెల్లంలో 9.7 గ్రాముల చక్కెర ఉంటుందని చెప్పారు. కాబట్టి ఒక రోజులో పరిమిత పరిమాణంలో బెల్లం తినాలి. అంతే కాదు బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.
3. వాపులకు కారణం శరీరంలో వాపులు, మంట సమస్యలు ఉన్నవారు బెల్లం తినకూడదని సూచిస్తున్నారు. బెల్లంలో ఉండే సుక్రోజ్ కారణంగా వాపు మరింత తీవ్రమవుతుంది. నివేదికల ప్రకారం.. సుక్రోజ్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో కనిపించినప్పుడు అవి వాపుకు కారణం అవుతాయి. బెల్లం తినడానికి రుచికరంగా అనిపించినప్పటికీ కొద్దిగా మాత్రమే తినాలి.
4. కడుపులో పురుగులు చాలా వరకు బెల్లం గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతుంది. బెల్లం తయారు చేసేటప్పుడు ఒక్కోసారి అందులో మట్టికూడా కలుస్తుంది. ఎంత శుభ్రం చేసినా బెల్లంతో మట్టి వేరుపడదు. కడుపులో పురుగులు రావడానికి ఈ మట్టి కారణం అవుతుంది. కాబట్టి బెల్లం ఎక్కువగా తీసుకోకూడదు. అంతేకాదు అది శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి.