AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: చలికాలంలో బరువు తగ్గాలంటే ఈ విషయాలు తెలుసుకోండి..

Weight Loss Tips: అనేక అధ్యయనాల ప్రకారం చాలామంది వేసవిలో కంటే చలికాలంలో ఎక్కువగా తింటారు. దీని వల్ల శీతాకాలంలో అధిక బరువు పెరుగుతారు.

Weight Loss Tips: చలికాలంలో బరువు తగ్గాలంటే ఈ విషయాలు తెలుసుకోండి..
Weight Loss
uppula Raju
|

Updated on: Jan 03, 2022 | 8:45 PM

Share

Weight Loss Tips: అనేక అధ్యయనాల ప్రకారం చాలామంది వేసవిలో కంటే చలికాలంలో ఎక్కువగా తింటారు. దీని వల్ల శీతాకాలంలో అధిక బరువు పెరుగుతారు. ఈ పరిస్థితిలో ఆహారాన్ని జాగ్రత్తగా, తెలివిగా ఎంపిక చేసుకొని తినాలి. శరీరానికి హాని చేసే ఆహారాలకు బదులు సీజనల్ పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి. మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఈ చిట్కాలను పాటించి చూడండి మంచి ఫలితాలు ఉంటాయి.

1. ప్రతిరోజూ గోరువెచ్చని జీలకర్ర నీరు జీలకర్ర నీరు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ప్రతిరోజూ పరగడుపున గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగడం వల్ల మీ మానసిక స్థితి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బరువు తగ్గించడంలో, పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. జీవక్రియను పెంచడంలో తోడ్పడుతుంది.

2. బ్రేక్‌ ఫాస్ట్‌గా క్వినోవా క్వినోవా అనేది గ్లూటెన్ లేని ఒక రకమైన ధాన్యం. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మీరు అల్పాహారం కోసం క్వినోవా తీసుకోవచ్చు. ఇందులో పంచదార ఉండదు. కూరగాయలతో కలిపితే తింటే చాలా రుచిగా ఉంటుంది. సీజనల్ పండ్లు, కప్పు గ్రీన్ టీతో కూడా క్వినోవాను తీసుకోవచ్చు.

3. మధ్యాహ్న భోజనం మధ్యాహ్న భోజనంలో తాజాగా వండిన కూరగాయలు, పప్పుతో రోటీని తినండి. బజ్రా, రాగి, జొన్నలు మూడింటిని కలపి పిండి చేసి వాటితో చపాతీలు చేయాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

4. గ్రీన్ టీతో డ్రై ఫ్రూట్స్ మీరు బరువు తగ్గించే డైట్‌లో ఉన్నప్పుడు గింజలు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అంతేకాదు ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ గురించి మాట్లాడుతూ ఇది ఉదయం సాయంత్రం తీసుకోవాలి.

5. గ్లాసు పసుపు పాలు పనీర్‌లో ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపుని నిండుగా ఉంచుతుంది. నెమ్మదిగా జీర్ణమవుతుంది. పనీర్ మీ ఆకలిని తగ్గిస్తుంది. ఇది ఎక్కువ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. పసుపు పాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గ్లాసు పసుపు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

చలికాలంలో బెల్లం ఎక్కువగా తింటున్నారా..! జాగ్రత్త ఈ సమస్యలు వచ్చే అవకాశం..

Health care tips: ఆరోగ్యకరమైన ఆహారం మీ జీవితాన్నే మార్చేస్తుందని మీకు తెలుసా.. కొత్త ఏడాదిలో కొత్తగా ట్రై చేయండి..

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై