AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌ మానేసే వారికి అకాల మృత్యువు ముంగిట్లోనే..! కాస్త చూస్కోండి మరీ..

What Happens to Your Body When You Skip Breakfast: కొందరు జాబ్‌కి వెళ్లాలనే హడావిడిలో సమయం లేకపోవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తుంటారు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెల్లడైంది. ఇలా ఉదయం అల్పాహారం తినడం మానేయడం వల్ల..

Morning Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌ మానేసే వారికి అకాల మృత్యువు ముంగిట్లోనే..! కాస్త చూస్కోండి మరీ..
ఉదయం టిఫిన్‌ తీసుకోవడం మానేస్తే జీవక్రియ మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఇది దారి తీస్తుంది. శరీర మెటబాలిజం తగ్గడం వల్ల జీవక్రియ రేటు తగ్గుతుందని అంటున్నారు.
Srilakshmi C
|

Updated on: Sep 18, 2025 | 9:40 PM

Share

రోజులో తొలి భోజనం బ్రేక్‌ఫాస్ట్‌. ఇది సరైన సమయానికి తీసుకోవాలి. కానీ కొందరు జాబ్‌కి వెళ్లాలనే హడావిడిలో సమయం లేకపోవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తుంటారు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెల్లడైంది. ఇలా ఉదయం అల్పాహారం తినడం మానేయడం వల్ల అకాల మరణం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని వెల్లడించింది.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్, న్యూకాజిల్‌లో నివసిస్తున్న 3 వేల మంది పెద్దల డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 1983 నుంచి 2017 వరకు 42 నుంచి 94 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు పాల్గొన్నారు. నిపుణులు వారి ఆరోగ్యం, తినే విధానాలు, జీవనశైలి గురించి సర్వేలు నిర్వహించారు. రెండు దశాబ్దాల డేటాతో ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు వారి మొదటి, చివరి భోజనాన్ని ఆలస్యం చేస్తున్నట్లు పరిశోధకులు గమనించారు. ఈ మార్పు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వారు కనుగొన్నారు.

సమయ వ్యత్యాసం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే?

ఇటీవలి అధ్యయనం ప్రకారం.. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునే సమయం వృద్ధుల మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తేలింది. మనం ఏమి తింటున్నామో ఎంత ముఖ్యమో.. ఏయే వేళలకు తింటున్నామో అన్న విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. ఉదయం ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ తినే అలవాటు జీర్ణక్రియ, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి

బ్రేక్‌ఫాస్ట్‌ ఆలస్యంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?

బ్రేక్‌ఫాస్ట్‌ ఆలస్యంగా తీసుకోవడం వల్ల మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకుల అధ్యయనంలో కనుగొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ ఆలస్యంగా తీసుకునే ప్రతి గంటకు, మరణ ప్రమాదం 8-11% పెరుగుతుంది. అల్పాహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో సమయం చాలా ముఖ్యమైనదని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఈ అలవాటు వృద్ధులలో అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడంలో సమయపాలన అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండాలని చెబుతున్నారు. దీనిపై హార్వర్డ్ మెడికల్ స్కూల్ పోషకాహార నిపుణుడు డాక్టర్ హసన్ దష్టి మాట్లాడుతూ.. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ సమయం ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అల్పాహారం ఆలస్యంగా తినడం వల్ల ఆరోగ్యం వేగంగా క్షీణించడానికి దారితీస్తుంది. దీనితోపాటు నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం, అలసట, ఒకే చోట కదలకుండా కూర్చోవడం వంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.