AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET Notification: మెగా డీఎస్సీలో జాబ్‌ మిస్‌ అయిన వారికి మరో ఛాన్స్‌! నవంబరులో కొత్త టెట్ నోటిఫికేషన్‌..

ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో దాదాపు చాలా మంది పరిస్థితి ఇదే. మార్కులు దండిగా వచ్చినా జాబ్‌ దక్కలేదు. అయితే ఇలాంటి వారికి ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు కలిపి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ యేటా ప్రకటిస్తామని ఇప్పటికే..

AP TET Notification: మెగా డీఎస్సీలో జాబ్‌ మిస్‌ అయిన వారికి మరో ఛాన్స్‌! నవంబరులో కొత్త టెట్ నోటిఫికేషన్‌..
AP TET Notification Date
Srilakshmi C
|

Updated on: Sep 16, 2025 | 5:28 PM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 16: గంపెడు ఆశతో రాత్రింబగళ్లు చదివినా.. అదృష్టం ఎల్లప్పుడూ కొందరినే వరిస్తుంది. అయినా నిరుత్సాహ పడకుండా పట్టుదలతో మళ్లీ మొదలు పెడితేనే విజయం వరిస్తుంది. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో దాదాపు చాలా మంది పరిస్థితి ఇదే. మార్కులు దండిగా వచ్చినా జాబ్‌ దక్కలేదు. అయితే ఇలాంటి వారికి ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు కలిపి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ యేటా ప్రకటిస్తామని ఇప్పటికే మంత్రి లోకేష్‌ ప్రకటించారు. ఆ ప్రకారంగా వచ్చే ఏడాది నిర్వహించే డీఎస్సీకి ముందు మరోమారు టెట్‌ పరీక్ష నిర్వహించాలని సర్కార్‌ భావిస్తుంది. ఈ మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్షను వచ్చే నవంబరులో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తాజాగా ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన 406 పోస్టులను వచ్చే డీఎస్సీకి తీసుకువెళ్తామని, ప్రత్యేక డీఎస్సీ కోసం కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాబట్టి అభ్యర్ధులు పరీక్షలకు ప్రిపేర్‌ కావాలని ఆయన సూచించారు.

నేటి నుంచి ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా వెబ్‌ఆప్షన్లు షురూ..

తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో భాగంగా కన్వీనర్‌ కోటా కింద విద్యార్థులు మంగళవారం (సెప్టెంబర్‌ 16) నుంచి వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలని కాళోజీ వర్సిటీ సూచించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, మైనారిటీ, నాన్‌ మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం సెప్టెంబరు 18వ తేదీ రాత్రి 11.30 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని, ఈలోపు అభ్యర్ధులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. సీటు పొందిన విద్యార్థులు రూ.12 వేలు రుసుము చెల్లించి ఎలాట్‌మెంట్‌ ఆర్డర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను కాళోజీ వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్