AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking Vs Diabetes: సిగరేట్‌ మానేస్తే డయాబెటిస్‌ వ్యాధి నయమవుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

డయాబెటిస్ ఉన్నవారిలో క్లోమం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. అలాగే, శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. కాలక్రమేణా రక్తంలో అధిక చక్కెర పెరిగి శరీర అవయవాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, అంధత్వం వంటి సమస్యలు తీవ్రమై ప్రాణాంతకం అవుతాయి..

Smoking Vs Diabetes: సిగరేట్‌ మానేస్తే డయాబెటిస్‌ వ్యాధి నయమవుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Can Quitting Smoking Reverse Diabetes
Srilakshmi C
|

Updated on: Sep 18, 2025 | 9:16 PM

Share

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఇది శరీరం గ్లూకోజ్‌ను జీవక్రియ చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో క్లోమం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. అలాగే, శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. కాలక్రమేణా రక్తంలో అధిక చక్కెర పెరిగి శరీర అవయవాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, అంధత్వం వంటి సమస్యలు తీవ్రమై ప్రాణాంతకం అవుతాయి. ఇందులో టైప్ 2 డయాబెటిస్ అత్యంత సాధారణ రకం. ఇది ప్రపంచవ్యాప్తంగా 95% కంటే ఎక్కువ కేసులకు కారణమవుతుంది. ఇక టైప్ 1 డయాబెటిస్ వంశపారంపర్యంగా వస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ జీవనశైలి ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతుంది.

ఆసియన్ హాస్పిటల్‌లోని సీనియర్ వైద్యుడు డాక్టర్ సందీప్ ఖర్బ్ దీని గురించి మాట్లాడుతూ.. ధూమపానం వల్ల డయాబెటిస్ ప్రమాదం ఎలా పెరుగుతుందో వివరించారు. ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 30 నుంచి 40 శాతం ఎక్కువని ఆయన అన్నారు. సిగరెట్ రసాయనాలు కణాలను దెబ్బతీస్తాయని, వాపుకు కారణమవుతాయని, రక్తంలో చక్కెరను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తాయని ఆయన వివరించారు. ధూమపానం మధుమేహ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. మధుమేహం ఉన్నవారు ధూమపానం చేస్తే.. వారికి గుండె సమస్యలు, అధిక రక్తపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, అంధత్వం, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల అవయవాలు విచ్ఛేదనం అయ్యే అవకాశం ఉందని డాక్టర్ ఖార్బ్ హెచ్చరిస్తున్నారు.

ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

  • రక్తంలో చక్కెర నియంత్రణ
  • మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ
  • శస్త్రచికిత్స నుంచి వేగంగా కోలుకోవడం
  • గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం తగ్గుదల

ధూమపానం మానేసిన 8 వారాలలోనే ఇన్సులిన్ మరింత సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. ధూమపానం మానేయడం వల్ల మధుమేహం నయం కాకపోయినా, శరీరాన్ని వ్యాధి నుంచి దూరంగా ఉంచడంలో, సంబంధిత ప్రాణాంతక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.