Health Tips: రుచి గురించి ఆలోచించకండి.. ఈ నీరు తాగితే సూపర్ బెన్ఫిట్స్ అంతే!.. వీరికి మరింత ప్రయోజనం!
ఎండుద్రాక్ష వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. మామూలు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఇవి రెండే వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అయితే నల్ల ఎండుద్రాక్ష వల్ల మహిళలకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇంటి పని, జాబ్, వర్క్ ప్రెజర్, ఎముకల బలహీనత కారణంగా మహిళలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను దూరం చేసుకునేందుకు అనే మంది వైద్యులను సంప్రదిస్తారు. కానీ వారు పూర్తి పరిష్కారం పొందలేరు. కానీ వారీ ఆహారంలో చేసుకునే కొన్ని అలవాట్లో వారు తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు తమ రోజువారీ ఆహారంలో నల్ల ఎండుద్రాక్షను చేర్చుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటి ప్రత్యేకత ఏమిటంటే వాటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినడం వల్ల వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి వీటిని రోజూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల ఎండుద్రాక్ష తినడం, నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
రక్తహీనతను నివారిస్తుంది: నల్ల ఎండుద్రాక్షలో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ కలయిక శరీరం ఇనుమును బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఋతుక్రమం సమయంలో లేదా గర్భధారణ సమయంలో మహిళలకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రతిరోజూ నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం, లేదా వాటి వాటర్ తాగడం వల్ల రక్తహీనత వంటి ఇనుము లోపాన్ని నివారించవచ్చు అలాగే శక్తి స్థాయిలను నిర్వహిస్తుంది.
హార్మోన్ బ్యాలెన్స్: ఎండుద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇది PCOS, PMS లేదా మెనోపాజ్‌తో సంబంధం ఉన్న మానసిక కల్లోలం, తిమ్మిర్లు, హార్మోన్ల అసమతుల్యతలను తగ్గించి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: నానబెట్టిన ఎండుద్రాక్ష, వాటి నీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తాయి. ఇవి ముడతలు, మచ్చలను తగ్గించడం ద్వారా వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: నానబెట్టిన ఎండుద్రాక్ష, వాటి నీటిలో ఉండే ఫైబర్ మృదువుగా మారుతుంది, ఇది మనం తిన్న ఆహారాన్ని జీర్ణం కావడాన్ని సులభతరం చేస్తుంది. ఇవి సహజ భేదిమందుగా కూడా పనిచేస్తాయి, అలాగే ఈ నీటిని రోజూ తాగడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తాయి.
ఎముకలు బలపడతాయి: నల్ల ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్, పొటాషియం ఉంటాయి, ఇవి మహిళలో ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల, వీటి నీటిని తాగడం వల్ల ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




