Hair Care Tips: చలికాలంలో శిరోజాలను సంరక్షించుకోండిలా.. ఇవి తెలుసుకోండి..

Hair Care Tips: చలికాలంలో శిరోజాలను సంరక్షించుకోండిలా.. ఇవి తెలుసుకోండి..
Hair Care

ఇతర కాలాలతో పోల్చితే శీతాకాలంలో చర్మం, జుట్టు సమస్యలు అధికంగా  ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా చలికాలంలో జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది.  పోషకాహార లోపం, వేళకు తినకపోవడం, వాతావరణ

Basha Shek

| Edited By: Ravi Kiran

Jan 20, 2022 | 7:01 AM

ఇతర కాలాలతో పోల్చితే శీతాకాలంలో చర్మం, జుట్టు సమస్యలు అధికంగా  ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా చలికాలంలో జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది.  పోషకాహార లోపం, వేళకు తినకపోవడం, వాతావరణ కాలుష్యం,   హార్మోన్ల సమస్యలే ఇందుకు కారణం. ఈక్రమంలో కురులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తుంటాం. అయితే వీటిలోని రసాయనాలు ఒక్కోసారి తీవ్ర దుష్ఫ్రభావం చూపుతంటాయి. అందుకే ఇంట్లోనే దొరికే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించడం మేలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా ఇంట్లోనే తయారుచేసిన హెయిర్ మాస్క్, ఆయిల్ మసాజ్, రైస్ వాటర్ తో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.

ఈ చిట్కాలు పాటించండి..

* ఒక గిన్నెలో ఒక  టీస్పూన్ షాంపూ, ఆముదం, గ్లిజరిన్,  ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి హెయిర్ ప్యాక్ ను తయారుచేసుకోండి.  జుట్టును కొద్దిగా తడిపి ఈ ప్యాక్ ను అప్లై చేయండి. సుమారు  10-20 నిమిషాలు అలాగే ఉంచి ఆతర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే కురులు బలంగా మారుతాయి.

*అరటిపండు,  ఒక టీస్పూన్ ఆలివ్ నూనె,   టీస్పూన్ అలోవెరా జెల్ .. ఈ మూడింటిని కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీ జుట్టు కుదుళ్లకు పట్టించండి. సుమారు అరంగంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత పరిశుభ్రమైన నీటితో కడిగేయండి.

*చలికాలంలో పొడి జుట్టు చాలామందిని ఇబ్బంది పెడుతుంటుంది. ఇందుకోసం క్రమం తప్పకుండా నూనెను తలకు రాసుకోవాలి.    రెండు చుక్కల లావెండర్,  రోజ్ మేరీ  ఎసెన్షియల్ ఆయిల్స్‌తో  ఆర్గానిక్ కాస్టర్ ఆయిల్‌ని మిక్స్ చేసి  వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి.   నూనెను బాగా పీల్చుకోవడానికి వీలుగా మీ జుట్టును వెచ్చని టవల్‌తో  కప్పుకోవాలి.

*చలికాలంలో జుట్టు రాలడం అనే సమస్య తరచుగా ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైస్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అమినో యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ ,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.   అన్నం బాగా ఉడుకుతున్నప్పుడు మరికొద్దిగా నీళ్లు కలపండి. బియ్యం ఉడకడం ప్రారంభించినప్పుడు, అదనపు నీటిని తీసివేయండి. ఈ నీటిని జుట్టుకోసం ఉపయోగిస్తే మంచి ఫలితముంటుంది.

*చుండ్రును ఎదుర్కోవాలంటే  జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దీని కోసం  ఇంట్లో నే హెయిర్ మాస్క్ తయారుచేసుకోవచ్చు.  ఇందులో భాగంగా రెండు చెంచాల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం లేవగానే గింజలను పేస్ట్ లా చేసి అందులో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచండి. తర్వాత మైల్డ్ షాంపూ లేదా హెర్బల్ షాంపూతో జుట్టును కడగాలి.  ఇలా వారానికి 2 సార్లు  ఈ మాస్క్ ను ఉపయోగిస్తే మంచి ఫలితముంటుంది.

*కొబ్బరి పాలు ఆరోగ్యకరమైన జుట్టుకు ఆరోగ్యకరమైన సహజ పదార్ధం. దీని కోసం, కొబ్బరి పాలలో ఒక నిమ్మకాయ రసం,  4-5 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. దీన్ని జుట్టుకు పట్టించాలి. 4-5 గంటల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత పరిశుభ్రమైన నీటితో కడిగేయాలి.

Also Read:Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

IND Vs SA: సఫారీల దెబ్బకి చతికిలపడిన భారత్.. తొలి వన్డేలో ఓటమి

PIG vs Leopard: చిరుత పులినే తరిమి కొట్టిన అడవిపంది.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu