Pregnancy Care: గర్భధారణ సమయంలో కొబ్బరినూనె ఎంతటి మేలు చేస్తుందో తెలుసా?..
గర్భధారణ సమయమనేది మహిళల జీవితంలో ఎంతో ప్రధానమైనది. తల్లిగా మారే ఈ దశలో వారు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే హర్మోన్ల లో మార్పుల కారణంగా గర్భంతో ఉన్న మహిళలు
గర్భధారణ సమయమనేది మహిళల జీవితంలో ఎంతో ప్రధానమైనది. తల్లిగా మారే ఈ దశలో వారు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే హర్మోన్ల లో మార్పుల కారణంగా గర్భంతో ఉన్న మహిళలు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అధిక బరువు పెరగడం, జుట్టు ఊడిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మరి అదెలాగో తెలుసుకుందా రండి.
దురద నుంచి ఉపశమనం
చాలా మంది మహిళలకు గర్భధారణ సమయంలో దురద సమస్య బాగా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ సమయంలో కొబ్బరి నూనెతో శరీరానికి మసాజ్ చేయడం వల్ల దురద సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు డ్రైనెస్ సమస్య కూడా దూరమవుతుంది.
ఆరోగ్యానికి మేలు
గర్భధారణ సమయంలో కొబ్బరి నూనె తీసుకోవడం కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో కొబ్బరినూనె తీసుకోవడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడట. దీంతో పాటు ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు మెరగవుతాయట.
స్ట్రెచ్ మార్క్స్ లో తొలగించడంలో..
చాలా మంది మహిళలకు గర్భధారణ సమయంలో పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. ఇవి ప్రసవం తర్వాత కూడా చాలా కాలం పాటు ఉంటాయి. అయితే కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా స్ట్రెచ్ మార్క్స్‌పై రాయడం వల్ల సమస్య చాలా వరకు నయమవుతుంది.
ఆయిల్ పుల్లింగ్ ద్వారా..
గర్భధారణ సమయంలో, నోటి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే నోటి ద్వారా ఆహార పదార్థాలు మన కడుపులోకి చేరుతాయి . వాటి ద్వారానే పిల్లలకు పోషకాహారం అందుతుంది. ఈ క్రమంలో నోరు శుభ్రం చేసుకోవడానికి ఆయిల్ పుల్లింగ్ ఎంతో ఉత్తమ మార్గం. ఆయిల్ పుల్లింగ్ అనేది నూనెతో నోరు శుభ్రం చేసుకునే ఒక ప్రత్యేక ప్రక్రియ. ఇందులో భాగంగా కొబ్బరి నూనెను నోటిలో నింపుకొని కొంత సమయం పాటు స్విష్ చేయాలి. అప్పుడు నోటిలోని బ్యాక్టీరియా అందులోకి వస్తుంది. అయితే పొరపాటున కూడా ఈ నూనెను మింగకూడదు. దీని తరువాత, ఈ నూనెను పుక్కిలించాలి. ఇలా కొబ్బరినూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. రుచి చూసే సామర్థ్యం కూడా పెరుగుతుంది . తలనొప్పి, పంటి నొప్పి తదితర సమస్యలు కూడా దూరమవుతాయి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..
IND Vs SA: సఫారీల దెబ్బకి చతికిలపడిన భారత్.. తొలి వన్డేలో ఓటమి