Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..
జైల్లో శిక్ష అనుభవిస్తోన్న ఓ ఖైదీ ఎలాగోలా మొబైల్ ఫోన్ సంపాదించాడు. ఎంచక్కా కొద్ది రోజుల పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడాడు. అయితే ఖైదీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నట్లు, రోజూ కాల్స్ చేసి
జైల్లో శిక్ష అనుభవిస్తోన్న ఓ ఖైదీ ఎలాగోలా మొబైల్ ఫోన్ సంపాదించాడు. ఎంచక్కా కొద్ది రోజుల పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడాడు. అయితే ఖైదీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నట్లు, రోజూ కాల్స్ చేసి మాట్లాడుతున్నాడని జైలు అధికారులకు తెలిసిపోయింది. ఆ ఖైదీపై నిఘా పెట్టారు. అతని దగ్గర ఫోన్ ఉందని నిర్ధారణ చేసుకున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందామని ఖైదీ ఉన్న బ్యారక్ దగ్గరకు వెళ్లారు. అయితే జైలు అధికారులు వస్తున్నారన్న విషయం ఖైదీకి తెలిసిపోయింది. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. తీవ్ర భయాందోళన తో అమాంతం మొబైల్ ఫోన్‌ను మింగేశాడు. ఢిల్లీలోని తిహార్ జైలులో సుమారు 10 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఖైదీ కడుపులోనే ఉన్న ఫోన్ ను తాజాగా ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
అందుకే 10 రోజులు పట్టింది..
కాగా ఫోన్ ను పూర్తిగా మింగకుండా .. అధికారులు వెళ్లిపోయాక మొబైల్ ను బయటకు తీసి మళ్లీ వాడుకుందామనుకున్నాడట ఖైదీ. కానీ దురదృష్టవశాత్తూ ఆ ఫోన్ జారి కడుపులోకి వెళ్లిపోయింది. దీంతో వెంటనే ఖైదీని చికిత్స నిమిత్తం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు జైలు అధికారులు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సెల్ ఫోన్ అతని పొట్టలో ఉన్నట్లు తేలింది. ఈక్రమంలో తాజాగా ఖైదీకి ఎండోస్కోపీ సర్జరీ చేసి.. ఫోన్‌ను చిన్నపాటి వల సాయంతో పైకి లాగి నోటి ద్వారా బయటకు తీశారు వైద్యులు. మింగిన ఫోన్ ఏడు సెంటీ మీటర్ల పొడవు, మూడు సెంటీ మీటర్ల వెడల్పు ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా ఆపరేషన్ చేయకుండానే సెల్ఫోన్ తీయాలని వైద్యులు భావించారని..అందుకే ఫోన్ ను బయటకు తీసుకొచ్చేందుకు 10 రోజుల సమయం పట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని ..దీంతో అతడిని తిరిగి జైలుకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
అయితే జైలులో పటిష్ఠమైన భద్రతా చర్యలున్నా ఖైదీ దగ్గరకు సెల్ఫోన్ ఎలా వచ్చిందనే విషయం ఇంకా అధికారులను అంతుచిక్కడం లేదు. తనిఖీలు, నిబంధనలన్నీ కఠినంగా అమలు చేసినా ఖైదీ ఫోన్ కనిపించడంపై తిహార్ జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Delhi: Mobile phone swallowed by jail inmate removed after surgery
Read @ANI Story | https://t.co/5ngHX0zvhZ#Delhi pic.twitter.com/HNTOmYDHJw
— ANI Digital (@ani_digital) January 19, 2022
Also Read:
IND Vs SA: సఫారీల దెబ్బకి చతికిలపడిన భారత్.. తొలి వన్డేలో ఓటమి
సూర్యనమస్కారంతో 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Mrs Andhra Pradesh: 4 పదుల వయసులో మిసెసె ఆంధ్రప్రదేశ్‌గా ఎంపిక.. సత్తా చాటిన ఉత్తరాంధ్ర మహిళ!