Mrs Andhra Pradesh: 4 పదుల వయసులో మిసెసె ఆంధ్రప్రదేశ్‌గా ఎంపిక.. సత్తా చాటిన ఉత్తరాంధ్ర మహిళ!

Mrs Andhra Pradesh: 4 పదుల వయసులో మిసెసె ఆంధ్రప్రదేశ్‌గా ఎంపిక.. సత్తా చాటిన ఉత్తరాంధ్ర మహిళ!
Mrs Andhra Pradesh

పెళ్లైతే వంటింటికే పరిమితం కాదు.. ఏమైనా సాధించగల సత్తా మాకు ఉందంటున్నారు ఉత్తరాంధ్రకు చెందిన మహిళామణులు.

Balaraju Goud

|

Jan 19, 2022 | 9:58 PM

Mrs Andhra Pradesh: పెళ్లైతే వంటింటికే పరిమితం కాదు.. ఏమైనా సాధించగల సత్తా మాకు ఉందంటున్నారు విజయనగరం జిల్లాకు చెందిన పద్మావతి. మిసెస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను గెలిచి.. అందరికీ రోల్ మోడల్‌‌గా నిలిచారామె. ఉత్తరాంధ్రకు చెందిన మహిళ సత్తా చాటారు. పెళ్లైనా కూడా తగ్గేదే లేదంటున్నారు. తన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. ఒకవైపు తల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు బ్యూటీ కాంటెస్ట్‌లోనూ మెరిశారు. మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌ 2021 టైటిల్‌ను విశాఖపట్నంకు చెందిన పద్మావతి గెలుచుకోగా, శ్రీకాకుళానికి చెందిన రజనీ పైడి క్లాసిక్‌లో విజేతగా నిలిచారు.

విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన పద్మావతి..మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ 40యేళ్లలోపు వయసుగల కేటగిరిలో విన్నర్‌గా నిలిచారు. మొత్తం వందమంది మహిళల్లో.. ఫైనల్‌గా మిసెస్‌ ఆంద్రప్రదేశ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌జీవోను నిర్వహిస్తున్న మమతా త్రివేది ఈ అందాల పోటీలను నిర్వహించారు. గతంలో మిసెస్‌ ఇండియా విన్నర్‌గా నిలిచిన మమత త్రివేది. కరోనా ఎఫెక్ట్‌తో 2021 మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ పోటీలను వర్చువల్‌గా నిర్వహించారు. 2021 సెప్టెంబర్‌లో జరిగిన పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం వందమంది మహిళలు పార్టిసిపేట్‌ చేయగా.. 38మంది ఫైనల్స్‌కు అర్హత సాధించారు. చివరకు గ్రాండ్‌ ఫినాలేలో మంచి ప్రతిభ కనబరచిన పద్మావతి.. మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌ టైటిల్‌ను దక్కించుకున్నారు.

ఈ బ్యూటీ కాంటెస్ట్‌ ఉద్దేశం మోడల్స్‌ను క్రియేట్‌ చేయడం కాదు. మేకింగ్‌ రోల్‌ మోడల్స్‌ అంటున్నారు పద్మావతి. అందం ఒక్కటే కాదు. మహిళల్లో ఉన్న క్రియేటివిటీతో పాటు అన్ని అంశాలను చూస్తారంటున్నారు. మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నారంటున్నారు.

MBA పూర్తి చేసిన పద్మావతి.. మ్యారేజ్‌ అనంతరం విశాఖలో స్థిరపడ్డారు. గతేడాది ఏప్రిల్లో విశాఖలో నిర్వహించిన శ్రీమతి వైజాగ్ పోటీల్లోనూ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అయితే అప్పట్లో కొవిడ్ కారణంగా పాల్గొనలేకపోయారు. ఇక భర్త ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉన్నా కూడా కుటుంబ బాధ్యతలను మోస్తున్నారు. పిల్లలను చూసుకుంటూనే తనలోని టాలెంట్‌ను కూడా బయటపెడుతున్నారు. ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ లేదని నిరూపించారు.

ఇక, శ్రీకాకుళానికి చెందిన రజనీ పైడి మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక మహిళగా నిలిచింది. ఆమె మిసెస్ డైనమిక్ బిరుదును, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక రాయబారి బిరుదును, మిసెస్ క్లాసిక్ కేటగిరీ విజేతగా నిలిచింది. పొందూరు మండలం కనిమెట్టలో జన్మించిన రజని పైడి ఎంఏ, ఎంఈడీ చదివారు. కింతలి జెడ్పీ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆమె ఇంటర్మీడియట్ శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో చదివారు. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో MA పట్టా పొందారు.

ఆమె భర్త పైడి గోపాల్‌రావు పాలకొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌. ఆమె ప్రస్తుతం విశాఖపట్నంలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఆంగ్లంలో డాక్టరేట్‌ను అభ్యసిస్తున్నారు. మహిళల ఆర్థిక, సామాజిక, విద్య, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారి సాధికారత కోసం రజనీ ఒక NGOని కూడా నడుపుతున్నారు. రజనీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దశాబ్దానికి పైగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

మిసెస్ ఆంధ్రప్రదేశ్ – క్లాసిక్ కేటగిరీ (40 నుండి 60 సంవత్సరాల వయస్సు)

• విజేత – రజని పైడి

• మొదటి రన్నరప్ – స్నేహ చౌదరి

• రెండవ రన్నరప్ – మాధురి రెడ్డి

• మూడవ రన్నరప్ – మాధురి కోకా

మిసెస్ ఆంధ్రప్రదేశ్ – మిసెస్ కేటగిరీ (40 సంవత్సరాల వరకు)

• విజేత – పద్మావతి

• ఫస్ట్ రన్నరప్ – డాక్టర్ బజన రజని

• సెకండ్ రన్నరప్ – డాక్టర్ లావణ్య

Read Also…  వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు.. సమాజంపై ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu