Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Geyser: ఇంట్లో గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదంలో పడే ఛాన్స్..

మీ ఇంట్లో గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. అయితే, ఈ వార్త మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటీవల బెంగళూరులో గీజర్ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా 35 ఏళ్ల మహిళ, ఆమె 7 ఏళ్ల కూతురు మరణించిన సంగతి తెలిసిందే.

Gas Geyser: ఇంట్లో గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదంలో పడే ఛాన్స్..
Gas Geyser
Follow us
Venkata Chari

|

Updated on: Jan 19, 2022 | 9:45 PM

Gas Geyser: మీ ఇంట్లో గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. అయితే, ఈ వార్త మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటీవల బెంగళూరు(Bengaluru)లో గీజర్ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా 35 ఏళ్ల మహిళ, ఆమె 7 ఏళ్ల కూతురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గీజర్ నుంచి గ్యాస్ లీక్ అయిందని, కిటికీ మూసి ఉండడంతో విషవాయువు రావడంతో ఊపిరాడక ఇద్దరూ చనిపోయారని నివేదికలో తేలింది. ఈ ప్రమాదం గ్యాస్ గీజర్(Gas Geyser:) వినియోగదారులకు ప్రమాద ఘంటికలు మోగించినట్లయింది. గ్యాస్ గీజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీటితో మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోగలరు.

గ్యాస్ గీజర్ ఎలా పనిచేస్తుంది.. గ్యాస్ గీజర్ విద్యుత్ గీజర్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇది LPG ద్వారా నడుస్తుంది. నీటిని వేడి చేస్తుంది. దీనిలో ట్యాంక్ దిగువన ఒక బర్నర్ ఉంటుంది. అయితే వేడి నీరు పైపు ద్వారా దిగువకు చేరుకుంటుంది. ఎలక్ట్రిక్ గీజర్ల కంటే గ్యాస్ గీజర్లు చౌకగా ఉంటాయి. దీన్ని వినియోగం కూడా చాలా తేలికగా ఉంటుంది. చాలా మంది గ్యాస్ గీజర్లను ఎంచుకోవడానికి ఇదే కారణం.

ఈ విషయాలను గుర్తుంచుకోండి..

1.  మీరు కూడా గ్యాస్ గీజర్ ఉపయోగిస్తుంటే, ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

2. మూసివేసిన ప్రదేశాలలో (ఉదా. బాత్రూమ్, వంటగది) గ్యాస్ గీజర్‌ను ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయవద్దు. బాత్‌రూమ్‌, కిచెన్‌ వంటి ప్రదేశాల్లో దీన్ని అమర్చినట్లయితే వెంటిలేటర్లను ఎప్పుడూ తెరిచి ఉంచాలి. అలాగే ఎగ్జాస్ట్‌ను అలాగే ఉంచండి.

3. గ్యాస్ గీజర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా లీకేజీ లేదా మరేదైనా సమస్య ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి.

4. రోజంతా గ్యాస్ గీజర్‌ను వినియోగించడం సరికాదు. నిరాటంకంగా వినియోగిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.

5. గ్యాస్ గీజర్ కారణంగా ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే, బాధితుడిని వీలైనంత త్వరగా బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి. తద్వారా అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.

6. బాత్రూంలో స్నానం చేయడం ప్రారంభించే ముందు గ్యాస్ గీజర్‌ను స్విచ్ ఆఫ్ చేయండి. దీంతో స్నానం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండదు.

7. గ్యాస్ గీజర్‌లో లీకేజీ ఉంటే, దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు వస్తుంది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు.

8. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో స్నానం చేసే సమయంలో లేదా తర్వాత అలాంటి సమస్య ఏదైనా కనిపిస్తే, వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి.

Also Read: Olive Oil Benefits: ఆలివ్ ఆయిల్‌‌తో 8 ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకుంటే ప్రతిరోజూ ఉపయోగిస్తారు..!

Potatoes Side Effects: మొలకెత్తిన బంగాళదుంపలను తింటున్నారా.? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి.!