AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giant Egg Roll: స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ని ఆకర్షిస్తున్న భారీ ఎగ్ రోల్.. ముఫై గుడ్లతో తయారీ.. వీడియో వైరల్..

Giant Egg Roll:సోషల్ మీడియా (Social Media) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏమి జరిగినా వెంటనే అందరి వద్దకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా

Giant Egg Roll: స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ని ఆకర్షిస్తున్న భారీ ఎగ్ రోల్.. ముఫై గుడ్లతో తయారీ.. వీడియో వైరల్..
Giant Egg Roll
Surya Kala
|

Updated on: Jan 20, 2022 | 7:35 AM

Share

Giant Egg Roll:సోషల్ మీడియా (Social Media) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏమి జరిగినా వెంటనే అందరి వద్దకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఫుడ్ లవర్స్ (Food Lovers)కోసం డిఫరెంట్ ఫుడ్స్ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా స్ట్రీట్ ఫుడ్ (Street Food)లవర్స్ కోసం ఓ భారీ స్నాక్ ఐటెం వీడియో ఒకటి తెగ హల్ చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 30 గుడ్లతో తయారు చేసిన అత్యంత భారీ ఎగ్ రోల్‌. ఈ వీడియోలోని ఎగ్ రోల్ చాలా మంది నెటిజన్లను ఆకర్షించింది. ఎగ్ రోల్ సైజ్, తయారీ చేసిన విధానానికి ఫిదా అయ్యారు. రకరకాల ఎమోజీలతో తమ ఇష్టాన్ని తెలియజేస్తున్నారు.

ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని బ్రహ్మపుత్ర మార్కెట్‌లో చిత్రీకరించబడింది. ఎగ్ రోల్‌ను సిద్ధం చేసేందుకు ఒక వ్యక్తి మొదట.. పెనం మీద కొంచెం నూనె వేసి.. తర్వాత కట్ చేసిన కూరగాయల ముక్కలతో పాటు ఉప్పు, కారం , సాస్ వేసి స్టఫ్ ను తాయారు చేశాడు. అనంతరం కొన్ని చపాతీ పిండి ఉండలను తీసుకుని తీసుకుని, దానిని ఒకదానిపై ఒకటిగా వేసి.. పెద్ద చపాతీలా ఒత్తాడు. ఆ పెద్ద చపాతీని మళ్ళీ పెనం మీద వేసి.. వేయించాడు. తర్వాత దానిపై దాదాపు 30 గుడ్ల వేసి.. ఆమ్లెట్ గా వేయించి.. అప్పుడు ఆ ఆమ్లెట్ పై కూరగాయల స్టఫ్ ను మరికొన్ని కొన్ని ఉల్లిపాయల ముక్కలను వేసి.. ఎగ్ రోల్ ను తయారు చేశాడు. ఈ వీడియో “30 గుడ్లు రోల్. దీన్ని ఒంటరిగా పూర్తి చేయగల వ్యక్తి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అనేక మంది హృదయాలను దోచుకుంది. హార్ట్ ఎమోజీలతో తమ లవ్ ని తెలియజేస్తున్నారు ఫుడ్ లవర్స్.

జెయింట్ ఎగ్ రోల్ తయారీని ఇక్కడ చూడండి:

జనవరి 9 న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి, ఈ వీడియో 3.2 లక్షలకు పైగా లైక్‌లను పొందింది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ని అమితంగా ఆకర్షించింది.

Follow Us
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?
వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?
'పంజా' హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? స్టన్ అవుతోన్న నెటిజన్లు
'పంజా' హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? స్టన్ అవుతోన్న నెటిజన్లు
వామ్మో.. గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా..?
వామ్మో.. గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా..?
పారిస్‌లో త్వరలో BAPS ఆలయం ప్రారంభోత్సవం
పారిస్‌లో త్వరలో BAPS ఆలయం ప్రారంభోత్సవం