PIG vs Leopard: చిరుత పులినే తరిమి కొట్టిన అడవిపంది.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా చిరుతపులి, అడవి పందికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా చిరుతపులి, అడవి పందికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిరుతపులి అడవి పంది పిల్లని వేటాడాలనుకుంది. మాటువేసి పంది పిల్లని నోటితో పట్టుకుని పరుగెత్తుతుంది. ఇది గమనించిన తల్లి పంది తన బిడ్డను రక్షించుకోడానికి చిరుతపులి వెంటపడింది. అడవి పంది వస్తున్న స్పీడుకి చిరుత ఖంగుతింది.. పంది పిల్లను వదలకపోతే తన పని అయిపోతుందనుకొని దాన్ని అక్కడే వదిలేసి పారిపోయింది. అయినా ఆగని తల్లి పంది చిరుతను దరిదాపుల్లో కనబడకుండా చిరుతను తరిమి తరిమి కొట్టింది. అడవిలో సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఈ సంఘటన అంతా వీడియో తీసి వైల్డ్_యానిమల్స్_ఆఫ్_దివరల్డ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. 28 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను లక్షమందికి పైగా నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.