Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు సంరక్షణ.. ఈ న్యాచురల్ టిప్స్‌తో చుండ్రు, హెయిర్ ఫాల్ సమస్యలు దూరం..
Hair Care Tips: వర్షాకాలం మొదలైంది. వాతావరణంలోని మార్పులు చర్మంతో పాటు జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు రాలడం, తల దురద పెట్టడం వంటి సమస్యలు
Hair Care Tips: వర్షాకాలం మొదలైంది. వాతావరణంలోని మార్పులు చర్మంతో పాటు జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు రాలడం, తల దురద పెట్టడం వంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. అందుకే ఈ సీజన్‌లో జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలంలో జుట్టు ఎక్కువ తేమగా ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ లాంటి సమస్యలకు దారి తీయవచ్చు. అంతే కాదు, కాలానుగుణంగా ఉండే తేమతో చర్మం కూడా పాడవుతుంది. ఇక జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు. కాబట్టి ఈ సీజన్‌లో జుట్టు చుండ్రు బారిన పడకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. మరి ఈ వర్షాకాలంలో జుట్టు పోషణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి.
పెరుగు
మనందరికీ తెలిసినట్లుగా, పెరుగు ఆరోగ్యానికి, చర్మానికి అదేవిధంగా జుట్టుకు చాలా అవసరం. పెరుగు జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టును మృదువుగా చేయడమే కాకుండా పోషణను కూడా అందిస్తుంది. పెరుగుతో తల దురద, చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. షాంపూ చేయడానికి అరగంట ముందు జుట్టుకు పెరుగును అప్లై చేయండి. ఈ పెరుగులో నిమ్మరసం కలుపుకోవచ్చు. పెరుగును జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు పోతుంది.
గుడ్లు
జుట్టు సంరక్షణకు గుడ్లు కూడా ఎంతో ఉత్తమం. వెంట్రుకలకు బలం చేకూర్చడంతో పాటు కొత్త మెరుపును అందిస్తాయి. ఈ హెయిర్ మాస్క్ చేయడానికి 3 గుడ్లు, 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసి జుట్టు మీద 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే ఒక గుడ్డులో మూడు టీస్పూన్ల పెరుగు మిక్స్ చేసి మంచి పేస్ట్ లా తయారుచేసుకుంటే జుట్టు రాలిపోయే సమస్య నుంచి బయటపడవచ్చు. తర్వాత జుట్టుకు ఈ మాస్క్‌ను అప్లై చేయండి. ఇది జుట్టు సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
కలబంద
కలబంద అన్ని జుట్టు సమస్యలను తొలగించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాకాలంలో వెంట్రుకలు రాలిపోయే సమస్యను దూరం చేసుకోవాలంటే నాలుగు టీస్పూన్ల కలబందను కొబ్బరినూనెలో కలిపి రాసుకుంటే మంచి పేస్ట్ లా తయారవుతుంది. తర్వాత ఈ పేస్ట్‌ని మీ జుట్టు మొత్తానికి అప్లై చేయండి. ఈ మాస్క్‌ని జుట్టు మీద ఇరవై నిమిషాల పాటు అప్లై చేయండి. ఆ తర్వాత జుట్టును చల్లటి నీటితో కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని తొలగించడమే కాకుండా, చుండ్రును వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..