220 కిలోల బరువున్న అద్నాన్‌ సమీ 75 కిలోలకు ఎలా చేరుకున్నాడు? ఈ స్టార్‌ సింగర్‌ మిరాకిల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వెనక ఉన్న సీక్రెట్స్‌ ఏంటంటే..

Adnan Sami Weight Loss Transformation: అద్నాన్‌ సమీ.. ప్రత్యేక పరిచయం అవసరం లేని స్టార్‌ సింగర్‌. తన గాత్రంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ గాయకుడికి తెలుగులోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. అతను తెలుగులో ఆలపించిన ఎన్నో పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి

220 కిలోల బరువున్న అద్నాన్‌ సమీ 75 కిలోలకు ఎలా చేరుకున్నాడు? ఈ స్టార్‌ సింగర్‌ మిరాకిల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వెనక ఉన్న సీక్రెట్స్‌ ఏంటంటే..
Adnan Sami
Follow us
Basha Shek

| Edited By: Phani CH

Updated on: Jun 28, 2022 | 7:11 AM

Adnan Sami Weight Loss Transformation: అద్నాన్‌ సమీ.. ప్రత్యేక పరిచయం అవసరం లేని స్టార్‌ సింగర్‌. తన గాత్రంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ గాయకుడికి తెలుగులోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. అతను తెలుగులో ఆలపించిన ఎన్నో పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌, వర్షం, యోగి, ఆడవారి మాటలకు అర్థాలేవేరులే, 100 పర్సెంట్‌ లవ్‌, ఊసరవెల్లి, ఇష్క్‌, జులాయి, గుండెజారి గల్లంతైందే, ఒకలైలా కోసం, టెంపర్‌ తదితర సినిమాల్లో అద్నాన్‌ ఆలపించిన పాటలు సంగీతాభిమానులను ఉర్రూతలూగించాయి. సినిమా ప్రపంచంలో స్టార్‌ సింగర్‌గా వెలుగొందుతోన్న అతను ఓ విషయంలో మాత్రం అభిమానుల నుంచి తరచూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే అతని బరువు. ఒకానొక సమయంలో సమీ బరువు దాదాపు రూ.220 కిలోలకు చేరుకుంది. చిన్నప్పుడు స్కూల్‌ గేమ్స్‌లో ఎంతో చురుగ్గా ఉండే ఈ సింగర్‌ ఎమోషనల్‌ డైట్‌ బాధితుడు. వీరు ఒత్తిడి, ఆందోళనల వంటి ప్రతికూల భావోద్వేగాల నుంచి బయటపడడానికి ఏది పడితే అది తింటారు. ఎమోషన్స్‌ను కంట్రోల్‌ చేసుకోవడానికి చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీంలు, స్వీట్లు తదితర జంక్‌ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అద్నాన్‌ కూడా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి ఎక్కువగా పిండి పదార్థాలు, చక్కెర, కొవ్వు, ఉప్పు మోతాదు ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకున్నాడు. అదే అతని బరువుకు కారణమైంది.

అదే కీలక మలుపు..

2005లో అద్నాన్ ఇండస్ట్రీ నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. కొద్దినెలలయ్యాక బరువెక్కిన దేహంతో కాకుండా స్లిమ్ ట్రిమ్ గా మారి దర్శనమిచ్చాడు. ఏకంగా 75 కిలోలకు తగ్గిన అతనిని చాలామంది గుర్తించలేకపోయారు. మరి అంత బరువున్న అద్నాన్‌ ఎలా స్లిమ్‌గా మారాడంటే.. అద్నాన్ 2005లో లింఫెడెమా శస్త్రచికిత్స చేయించుకున్నాడు . దీని కారణంగా 3 నెలల పాటు బెడ్‌కే పరిమితమయ్యాడు. ఈ సమయంలో అతను మరింత బరువు పెరిగిపోయాడు. కండరాల కింద ఉన్న కొవ్వు ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. బరువు తగ్గకుంటే ఆరు నెలలకు మించి బతకలేవని వైద్యులు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో హ్యూస్టన్ (టెక్సాస్)కు చెందిన ఓ పోషకాహార నిపుణుడిని సంప్రదించాడు. అతను అందించిన డైట్‌ టిప్స్‌తోనే కేవలం 16 నెలల్లోనే 150-155 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇవి కూడా చదవండి

శస్త్రచికిత్స అవసరం లేకుండా..

బరువు తగ్గేందుకు ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని అద్నాన్ సమీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తరచుగా ప్రజలు బరువు తగ్గడానికి లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంటారు, దీనిలో శరీరంలోని అవాంఛిత కొవ్వు తొలగించబడుతుంది. అయితే 220 కిలోల బరువున్న వ్యక్తికి, ఈ శస్త్రచికిత్స ద్వారా కొవ్వును తొలగించడం అసాధ్యం. ‘ నా బరువు తగ్గించుకునేందుకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నాను. తక్కువ కార్బ్, అధిక ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ప్రారంభించాను. తక్కువ కేలరీల ఆహారం తీసుకున్నాను. నా డైట్‌లో అన్నం, బ్రెడ్ వంటి అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ ఉండవు. సలాడ్లు, చేపలు, ఉడకబెట్టిన పప్పులు మాత్రమే తినాలని నిపుణులు సూచించారు. రోజు ప్రారంభంలో చక్కెర లేకుండా టీ తీసుకున్నాను. మధ్యాహ్న భోజనంలో సలాడ్, చేపలు తీసుకున్నాను. రాత్రి భోజనంలో అన్నం లేదా రొట్టె సాదా ఉడికించిన పప్పు లేదా చికెన్ ఉంటుంది. చక్కెర లేని డ్రింక్స్‌ మాత్రమే తీసుకున్నాను. అల్పాహారంగా పాప్ కార్న్ ను ఎక్కువగా తీసుకునేవాడిని. అలాగే తేలికపాటి వ్యాయామాలు, కార్డియో ఎక్సర్‌సైజులను నా లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకున్నాను. అలా నెలకు 10 కిలోల బరువు తగ్గాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడీ స్టార్‌ సింగర్‌.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..