Spices Plants: ఇంట్లోనే ఈజీగా మసాలా మొక్కలను పెంచేయండిలా..

భారతదేశంలో మసాలా దినుసులకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వీటితో ఆరోగ్యంతో పాటు రుచి కూడా లభ్యమవుతుంది. మసాలాలను ఆయుర్వేదంలో కూడా పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగించే వారు. కొన్ని రకాల మసాలా మొక్కలను ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. అందులోనూ వచ్చేది వర్షా కాలం కాబట్టి.. మొక్కలు చక్కగా పెరుగుతాయి. దీంతో డబ్బు కూడా ఆదా..

Spices Plants: ఇంట్లోనే ఈజీగా మసాలా మొక్కలను పెంచేయండిలా..
Spice Plants
Follow us

|

Updated on: Jun 17, 2024 | 5:30 PM

భారతదేశంలో మసాలా దినుసులకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వీటితో ఆరోగ్యంతో పాటు రుచి కూడా లభ్యమవుతుంది. మసాలాలను ఆయుర్వేదంలో కూడా పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగించే వారు. కొన్ని రకాల మసాలా మొక్కలను ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. అందులోనూ వచ్చేది వర్షా కాలం కాబట్టి.. మొక్కలు చక్కగా పెరుగుతాయి. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ఇంట్లో ఎలాంటి మసాలా మొక్కలు వేస్తే ఈజీగా ఎదుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా:

పుదీనా అంటే చాలా మందికి ఇష్టం. దీని నుంచి మంచి ఘుమఘుమలాడే సువాసన వస్తూ ఉంటుంది. ఎందులో వేసినా రుచి పెరుగుతుంది. పుదీనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పుదీనా వేర్లను మట్టిలో పెడితే క్రమంగా పెరుగుతాయి. ఎలాంటి మందులు వాడాల్సిన పని లేదు.

అల్లం:

వంటగదిలో ఎక్కువ ఉపయోగించే వాటిల్లో అల్లం కూడా ఒకటి. అల్లం ఎక్కువగా వెచ్చని ప్రదేశంలో ఎక్కువగా పెరుగుతుంది. వేర్లు ఉన్న చిన్న అల్లం మొక్కను తీసుకుని పెద్ద పాత్రలో మట్టి వేసి నాటండి. దీన్ని ఎండ బాగా తగిలే చోట పెడితే మంచిది. అవసరాన్ని బట్టి నీళ్లు పోస్తూ ఉండండి.

ఇవి కూడా చదవండి

జీలకర్ర:

జీలకర్ర మొక్కను కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. జీలకర్రను పండించుకోవడానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. చిన్న కుండీలో వేసుకుంటే చాలు. ఒక కుండీ తీసుకుని అందులో మట్టి వేసి.. కొద్దిగా జీలకర్రను చల్లి.. పైన కొద్దిగా నీళ్లు చల్లండి. అంతే కొద్ది రోజులకు జీలకర్ర మొక్కలు వస్తాయి.

కరివేపాకు:

వంటగదిలో నిత్యం అవసరం ఉండే వాటిల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ మొక్కను చిన్న కుండీలో కూడా వేసుకోవచ్చు. మట్టివేసిన చిన్న కుండీలో.. వేర్లతో ఉండే కరివేపాకు మొక్కను వేయండి. ప్రతి రోజూ కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది.

కొత్తి మీర:

కొత్తిమీరను కూడా మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీర ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా మంచిది. కొత్తి మీర తినడం వల్ల అందాన్ని సైతం పెంచుకోవచ్చు. కొత్తి మీర పెంచడానికి చిన్న కుండీ లేదా పెద్ద కుండీ కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న స్థలం బట్టి కొత్తిమీర పెరుగుతుంది. మట్టి వేసిన కుండీలో కొద్దిగా నీళ్లు చల్లితే.. కొత్తిమీర మొక్కలు వస్తాయి. ఇలా మనం ఇంట్లోనే మసాలా మొక్కలను పెంచుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles