Diabetes Reduce Diet: మీ డైట్‌ని ఇలా ప్లాన్ చేసుకుంటే.. ఖచ్చితంగా షుగర్ తగ్గాల్సిందే!

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారు సైతం డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. మీ ఆహారపు అలవాట్ల కారణంగానే మధుమేహం వస్తుంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను..

Diabetes Reduce Diet: మీ డైట్‌ని ఇలా ప్లాన్ చేసుకుంటే.. ఖచ్చితంగా షుగర్ తగ్గాల్సిందే!
Diabetes Tips
Follow us

|

Updated on: Jun 17, 2024 | 5:30 PM

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారు సైతం డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. మీ ఆహారపు అలవాట్ల కారణంగానే మధుమేహం వస్తుంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే డయాబెటీస్ రాకుండా చేసుకోవచ్చు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అనేది నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సరైన పోషకాలను మోతాదులో తీసుకుంటే చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా నియంత్రించుకోవచ్చు. అంతే కాకుండా మీ ఆరోగ్యాన్ని మొత్తాన్ని మెరుగు పరచుకోవచ్చు.

ఫైబర్:

పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది. అలాగే చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఎందుకంటే ఇందులో కరికే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి షుగర్‌ను కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు మీ డైట్‌లో ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకోండి.

మెగ్నీషియం:

డయాబెటీస్‌ను తగ్గించడంలో మెగ్నీషియం కూడా చక్కగా పని చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మెగ్నీషియం లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీంతో మెగ్నీషియం లోపంతో మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకు పచ్చ కూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

విటమిన్ డి:

విటమిన్ డి తక్కువగా ఉంటే టైప్ – 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉదయం సూర్యరశ్మిలో ఉండాలి. అలాగే వైద్యుల్ని సంప్రదించి విటమిన్ – డి ఆహారం తీసుకోవాలి.

జింక్:

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో జింక్ కీలకమైన పాత్ర వహిస్తుంది. జింక్ తక్కువగా ఉంటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జింక్ అధికంగా ఉండే చిక్కుళ్లు విత్తనాలు, మాంసం తీసుకోవాలి.

పొటాషియం:

బీపీ, షుగర్ వ్యాధులతో బాధ పడేవారికి పోటాషియం చాలా అవసరం. కండరాలు, నరాలు ఆరోగ్యంగా ఉండాలంటే పోటాషియం ముఖ్యం. అరటిపండ్లు, నారింజ, బంగాళదుంపలు, టమాటాలు, బచ్చలికూరలో పొటాషియం అధికంగా ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు:

మధుమేహం వస్తే ఇతర ఎన్నో రోగాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడాలి. రోగనిరోధక శక్తి పెరగాలంటే.. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి శక్తిని అందించడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!