Chia Seeds vs Flax seeds: చియాసీడ్స్ vs అవిసె గింజలు వీటిల్లో ఏది తింటే మంచిది?

కాలాలు మారేకొద్దీ తినే ఆహారంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా గింజల్లో అనేక రకాలైన కొత్తవి వచ్చాయి. ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం జీడి పప్పు, బాదం, కిస్ మిస్‌ మాత్రమే కానీ.. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌కి ఒక పెద్ద లిస్టే వచ్చి చేరింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. ఈ రెండూ గింజలే. వీటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలని పోషకాహార..

Chia Seeds vs Flax seeds: చియాసీడ్స్ vs అవిసె గింజలు వీటిల్లో ఏది తింటే మంచిది?
Chia Seeds Vs Flax Seeds
Follow us

|

Updated on: Jun 17, 2024 | 5:43 PM

కాలాలు మారేకొద్దీ తినే ఆహారంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా గింజల్లో అనేక రకాలైన కొత్తవి వచ్చాయి. ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం జీడి పప్పు, బాదం, కిస్ మిస్‌ మాత్రమే కానీ.. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌కి ఒక పెద్ద లిస్టే వచ్చి చేరింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. ఈ రెండూ గింజలే. వీటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు. దీంతో చాలా మంది వీటిని తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. వీటిల్లో మంచి కొవ్వు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ లభ్యమవుతాయి. కానీ వీటిల్లో ఏది తింటే ఇంకా మంచిదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజలు:

అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్, ఫైబర్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మాంగనీస్, విటమిన్ బి1 వంటివి లభిస్తాయి. అవిసె గింజలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, కిడ్నీలు, లివర్, చర్మ, జుట్టు ఆరోగ్యం మెరుగు పడుతుంది. షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అలాగే అధిక బరువు కూడా కంట్రోల్ అవుతుంది.

చియా గింజలు:

చియా గింజల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చక్కగా సహాయ పడుతుంది. అలాగే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ ఉంటాయి. వీటిని కూడా తీసుకోవడం వల్ల.. రక్తంలో చక్కెర లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. బీపీ నార్మల్ అవుతుంది, గుండె ఆరోగ్యం, కిడ్నీలు, లివర్, చర్మ, జుట్టు ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును కూడా అదుపు చేస్తుంది. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది. చియా సీడ్స్ వల్ల ఇలా చాలా ఉపయోగాలే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఏది బెటర్:

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండూ ఆరోగ్యకరమైన గింజలే. రెండింటిలో కూడా మంచి పోషకాలు శరీరానికి లభిస్తాయి. మీకు ఉన్న సమయాన్ని బట్టి, శరీర అవసరాన్ని బట్టి మీకు ఏది నచ్చితే అవి తీసుకోవచ్చు. ఈ రెండింటిలో కూడా సమానమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండూ తినం మంచిదే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ఇలా చేస్తే మీ ఖాతాలో రూ. 5కోట్లు..
ఇలా చేస్తే మీ ఖాతాలో రూ. 5కోట్లు..
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??
ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??
లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి