Green Tea vs Black Tea: గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. ఈ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..
టీలో ఎన్నో రకాలు ఉంటాయి. ప్రతి రోజూ తాగే మిల్క్ టీ కంటే.. శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల టీలు ఉన్నాయి. సాధారణ టీ తర్వాత ఎక్కువగా తాగేది గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిదే. కానీ ఈ రెండింటిలో ఏది తాగితే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకోండి..
ఉదయం లేవగానే టీ తాగనిదే రోజను స్టార్ట్ కాదు. పొద్దున్నే ఓ చిన్న గ్లాస్ టీ లేదా కాఫీ పడాల్సిందే. అయితే ఈ టీలో అనేక రకాల ఉన్నాయి. పాలతో చేసిన టీ కంటే.. గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటివి కూడా తాగుతూ ఉంటారు. ఎవరికి నచ్చిన టీ వాళ్లు తాగుతూ ఉంటారు. రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే ఈ రెండు టీలలో ఏది ఎక్కువ మంచిదా అని జనం ఆలోచిస్తూ ఉంటారు. మరి గ్రీ టీ లేదా బ్లాక్ టీలో ఏది ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది? ఏది తాగితే శరీరానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు తెలుసుకోండి.
గ్రీన్ టీ:
మనలో ఉదయం మిల్క్ టీ తాగినా.. బయటకు వెళ్తే ఎక్కువగా గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. గ్రీన్ టీలో మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఒక కప్పు గ్రీన్ తాగితే శరీర మెటబాలిజం రేటు అనేది పెరుగుతుంది. క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చు అవుతాయి. శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కరగడంలో హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ తాగితే శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పని చేస్తుంది. అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం అనే సమస్యలు ఉండవు. తల నొప్పి కూడా రాకుండా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన కూడా కంట్రోల్ అవుతాయి.
బ్లాక్ టీ:
చాలా మంది మిల్క్ టీ బదులు కేవలం బ్లాక్ టీ మాత్రమే తాగుతారు. బ్లాక్ టీ అంటే ఏమీ కాదండి.. పాలు వేయకుండా ఉన్న డికాషన్. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. లివర్ ఆరోగ్యం, గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. నిద్ర రాకుండా యక్టీవ్‌గా ఉండాలంటే బ్లాక్ టీ ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ఇందులో కెఫీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. మరీ ఎక్కువగా తాగితే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు ఒక కప్పుకు మించి తాగకూడదు.
ఏది బెటర్:
బ్లాక్ టీ కంటే గ్రీన్ టీ తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఈ టీ రోజుకు రెండు, మూడు సార్లు తాగినా ఆరోగ్యానికి మంచిదే. కానీ బ్లాక్ టీ మాత్రం ఎక్కువగా తాగితే.. ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..