Weight loss drinks: పెరిగిన పొట్టతో షేమ్‌గా ఫీలవుతున్నారా.? ఈ డ్రింక్స్ తాగండి వెంటనే రిజల్ట్.
మారుతోన్న జీవన విధానం, వర్క్ కల్చర్ కారణంగా శారీరక శ్రమ భారీగా తగ్గిపోయింది. గంటల తరబడి కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య వేధిస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత కూడా ఇటీవల పొట్ట సమస్యతో బాధపడుతున్నారు..

మారుతోన్న జీవన విధానం, వర్క్ కల్చర్ కారణంగా శారీరక శ్రమ భారీగా తగ్గిపోయింది. గంటల తరబడి కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య వేధిస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత కూడా ఇటీవల పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. శరీరం ఫిట్‌గా ఉండాల్సిన సమయంలో పొట్టతో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. బరువు తగ్గడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. అయితే వ్యాయామంతో పాటు కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల భారీగా ఉన్న పొట్టను ఇట్టే కరిగించేయొచ్చని మీకు తెలుసా.? పొట్టను తగ్గించే అలాంటి కొన్ని డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* పొట్ట తగ్గించడంలో జీలకర్ర నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ డ్రింక్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక చెంచా జీలకర్రను నీటిలో ఉడకబెట్టాలి. అనంతరం జాలితో వడకట్టి ఆ పానియాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* గ్రీన్‌టీని నిత్యం తీసుకోవడం వల్ల కూడా బరవు తగ్గొచ్చు. సాధారణంగా గ్రీన్ టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ వేగవంతం కావడం వల్ల పొట్టలో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. వెరసి పొట్ట స్లిమ్‌గా మారుతుంది.
* పొట్ట తగ్గించడంలో సెలరీ జ్యూస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం సెలరీని రాత్రంతా నానబెట్టాలి. అనంతరం ఉదయం వేడి చేసుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.
* దాల్చిన చెక్కతో చేసిన డ్రింక్ కూడా బరువు తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో దాల్చిన చెక్కను 5 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం చల్లార్చి తాగాలి. ఇలా రాత్రి పడుకునే ముందు తగితే త్వరగా బరువు తగ్గుతారు.
* కీరదోస జ్యూస్‌తో కూడా పొట్ట తగ్గించుకోవచ్చు. ఒకటి లేదా రెండు కీరదోసకాయలు, 10 పుదీన ఆకులు, కొద్దిగా నీటిని తీసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఈ పేస్టును ఒక లీటర్ నీటిలో కలిపి దానికి కొంత నిమ్మరసం కలపాలి. ఈ జ్యూస్‌ను ప్రతిరోజూ తగితే శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం అందించినది మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం సూచించదగ్గ అంశం.
మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..