Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dates Benefits: చలికాలం ఖర్జూరం తింటే ఇన్ని లాభాలా.? అవెంటో తెలిస్తే మాత్రం అస్సలు వదలరు.

ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలికాలం వస్తూ వస్తూనే పలు వ్యాధులను వెంట తెస్తుంది. అయితే ఈ కాలంలో తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల ఇలాంటి సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు...

Dates Benefits: చలికాలం ఖర్జూరం తింటే ఇన్ని లాభాలా.? అవెంటో తెలిస్తే మాత్రం అస్సలు వదలరు.
Dates Benefits
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 18, 2022 | 6:40 AM

ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలికాలం వస్తూ వస్తూనే పలు వ్యాధులను వెంట తెస్తుంది. అయితే ఈ కాలంలో తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల ఇలాంటి సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు. ఇలాంటి బెస్ట్‌ ఫుడ్స్‌లో ఖర్జూర ఒకటి. ఖర్జూరలో ఉండే ఎన్నో పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చలికాలం ఫుడ్‌లో ఖర్జూరాను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను బాగు చేయడంలో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ బాగా ఉంటే, మలబద్ధకం సమస్య ఉండదు దీనివల్ల ఆరోగ్యం మెరగవుతుంది. ఇక ఖర్జూరంలోని పీచుపదార్థాలు గుండెను బలంగా, ఆరోగ్యంగా మార్చడంలో ఉపయోగపడతాయి. చలికాలంలో హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి కచ్చితంగా వీటిని డైట్‌లో భాగం చేసుకోవాలి. ఖర్జూరంలో ఉండే పొటాషియం గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఖర్జూరంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడం, ఆర్థరైటిస్, అల్జీమర్స్ వంటి వ్యాధులను దరి చేరనివ్వదు.

ఖర్జూరంలోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పరిశోధన ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 100 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకుంటే, గుండెపోటు ప్రమాదాన్ని 9 శాతం తగ్గించవచ్చని తేలింది. ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఖర్జూరం దివ్యౌషధం అని చెప్పొచ్చు. ఖర్జూరాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు. ఖర్జూరంలో నాడీ వ్యవస్థకు అవసరమైన అన్ని విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు నాడీ వ్యవస్థ యొక్క పనితీరును నిర్వహిస్తాయి. అంతే కాదు ఇందులో ఉండే పొటాషియం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఖర్జూరం గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఐరన్‌ తల్లీబిడ్డలిద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖర్జూరంలోని పోషకాలు గర్భాశయ కండరాలను బలోపేతం చేయడానికి కూడా పని చేస్తాయి. ఖర్జూరం తల్లి పాలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. దీనితో పాటు, బిడ్డ ప్రసవించిన తర్వాత సంభవించే రక్తస్రావం కూడా భర్తీ చేస్తుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల కళ్ల ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఖర్జూరంలో ఫ్లోరిన్ ఉంటుంది. ఇది దంత క్షయాన్ని నిరోధించే రసాయనం. అంతేకాదు, దంతాల ఎనామిల్‌ను బలపరుస్తుంది. ఖర్జూరాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. విటమిన్ B5 లోపం వల్ల వెంట్రుకలు బలహీనంగా మారడం ఊడిపోవడం వంటి సమస్యలకు ఖర్జూరతో చెక్‌ పెట్టొచ్చు.

నోట్: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం అందించినది మాత్రమే. ఆరోగ్యం విషయంలో నిపుణుల సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..