Health Tips: బొప్పాయి తిన్న వెంటనే ఇవి తింటున్నారా..? ఇలా చేస్తే మీకే ప్రమాదం!
ఈ పండ్లను తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బొప్పాయి పండు తిన్న తర్వాత చాలామంది ఇలాంటి ఆహారాలను తింటారు. ఇలా చేయడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ పండ్లను తిన్న తర్వాత ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జీర్ణశక్తిని బలోపేతం చేయడమే కాకుండా అనేక రకాల పొట్ట సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. చాలామంది బొప్పాయి పండును జుట్టు, చర్మ సమస్యలకు కూడా పరిష్కారంగా ఉపయోగిస్తారు. అయితే ఈ పండును రోజూ తినే వారు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ పండ్లను తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బొప్పాయి పండు తిన్న తర్వాత చాలామంది ఇలాంటి ఆహారాలను తింటారు. ఇలా చేయడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ పండ్లను తిన్న తర్వాత ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పాల ఉత్పత్తులు: పెరుగు, పాలు, చీజ్ ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్ల శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోవటం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా దీన్ని రోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
గుడ్లు: బొప్పాయి పండు తిన్నాక గుడ్డుతో చేసిన ఆహారాన్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల అజీర్ణం, వికారం, కడుపు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కొందరిలో వాంతులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫ్రూట్ సలాడ్ : ఇతర పండ్లను తిన్న తర్వాత బొప్పాయి పండు తింటే జీర్ణక్రియ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది గ్యాస్, ఉబ్బరం కూడా కలిగిస్తుంది.
చల్లని నీరు: బొప్పాయి తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల జీర్ణ సమస్యలు కూడా తేలికగా వస్తాయి. కానీ బొప్పాయి తిన్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..