వామ్మో.. చేపలు తిన్న తర్వాత ఐస్ క్రిమ్ తింటే ఏమవుతుందో తెలిస్తే షాకే..
చేపలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినొచ్చా.. చాలా మందికి ఇష్టమైన ఈ ఫుడ్ కాంబినేషన్ సురక్షితమేనా..? కొన్ని ఆహారాలను కలిపి తింటే శరీరానికి, జీర్ణవ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేపలు తిన్న తర్వాత మీరు పొరపాటున కూడా తీసుకోకూడని ఆ ముఖ్యమైన ఆహారాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మాంసాహారంలో చాలా మంది చేపలు తినడానికి ఇష్టపడతారు. అయితే కొందరికీ చేపలు తిన్న వెంటనే ఐస్ క్రీమ్ లేదా ఇతర చల్లని స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. చేపలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినడం సురక్షితమేనా, దీనివల్ల సమస్యలు వస్తాయా అనేది చాలా మందికి ఉన్న సందేహం. చేపలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినడం కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు లేదా అలర్జీలు ఉన్నవారు వెంటనే ఇబ్బందులు పడవచ్చు.
చేపలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినే ముందు గుర్తుంచుకోవాల్సినవి:
సమయం ఇవ్వండి: చేపలు తిన్న వెంటనే ఐస్ క్రీమ్ తినకుండా కనీసం ఒకటి నుండి ఒకటిన్నర గంటలు వేచి ఉండటం మంచిది.
శరీరంపై శ్రద్ధ: ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మీకు ఏదైనా అసౌకర్యం అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. భవిష్యత్తులో అలాంటి కలయికను మానుకోండి.
అలర్జీలు ఉంటే వద్దు: మీకు పాల ఉత్పత్తులతో అలర్జీ ఉంటే లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటే ఐస్ క్రీమ్ పూర్తిగా మానుకోవడం ఉత్తమం.
చేపలు తిన్న తర్వాత తీసుకోకూడని ఆహారాలు ఇవే:
పాలు లేదా పాల ఉత్పత్తులు: జీర్ణక్రియకు మంచిది కాదు. జీర్ణవ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్, చర్మ వ్యాధులు, చర్మంపై తెల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది.
సిట్రస్ పండ్లు : ఈ పండ్లు ఆమ్లంగా ఉంటాయి. ప్రోటీన్, ఆమ్లం కలిసినప్పుడు ప్రతిస్పందించి కడుపు సమస్యలను కలిగిస్తాయి.
టీ – కాఫీ: భోజనంతో పాటు టీ,కాఫీ తాగడం వల్ల చేపల్లోని పాదరసం శరీరం సరిగ్గా గ్రహించకుండా నిరోధించవచ్చు.
అధిక పిండి పదార్థాలు: ఇవి జీర్ణవ్యవస్థను నెమ్మదిస్తాయి. అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వలన ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.
ఆహార కలయికలు వ్యక్తి జీర్ణశక్తిని బట్టి మారుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం తెలివిగా ఎంపిక చేసుకోవడం ఎప్పుడూ మంచిది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




