AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snail Curry: చికెన్, మటన్ మించిన టేస్ట్ నత్త కూర సొంతం.. పోషకాల నిధి నత్త కూరని ఎలా చేసుకోవాలంటే..

నాన్ వెజ్ ప్రియులు మటన్ చికెన్ లతో పాటు రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు , స్టార్ ఫిష్ వంటి సీ ఫుడ్ ని కూడా ఇష్టంగా తింటారు. ఈ సీ ఫుడ్ లో నత్తలు వెరీ వెరీ స్పెషల్. ఈ నత్త కూరని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నత్తల్లో విటమిన్ బి6 , విటమిన్ ఎ వంటి అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. అందుకనే నత్తల కూర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ రోజు మటన్, చికెన్ మించిన టేస్ట్ ఉండే నత్తల కూర రెసిపీ గురించి తెలుసుకుందాం..

Snail Curry: చికెన్, మటన్ మించిన టేస్ట్ నత్త కూర సొంతం.. పోషకాల నిధి నత్త కూరని ఎలా చేసుకోవాలంటే..
Snail Curry
Surya Kala
|

Updated on: May 06, 2025 | 9:15 PM

Share

నాన్-వెజ్ ప్రియులు అనేక రకాల మాంసాహారాన్ని తీసుకుంటారు. వీటిలో నత్త ఒకటి. కొన్ని ప్రాంతాల ప్రజలు ఎంతో ఇష్టంగా తినే వంటకం. రుచికరంగా ఉండటమే కాదు అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. నత్తలు నదులు, చెరువులతో పాటు పొలాల గట్ల దగ్గర నిలిచి ఉండే నీటిలో కనిపించే సముద్ర జీవి. ఈ రోజు మటన్, చికెన్ మించి రుచికరమైన నత్త కూరగాయను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

నత్తలు –

ఉల్లిపాయలు – రెండు

ఇవి కూడా చదవండి

పచ్చి మిర్చి – 4

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్

గరం మసాలా – అర స్పూన్

మటన్ మసాలా – అర స్పూన్

పసుపు – కొంచెం

మిరియాల పొడి – ఒక స్పూన్

ధనియాల పొడి – అర స్పూన్

నూనె – వేయించడానికి సరిపడా

ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం: ముందుగా నత్తలను వేడి నీటిలో ఉడకబెట్టాలి. దీని తరువాత వీటిని శుభ్రమైన నీటితో బాగా కడగాలి. తరువాత ఒక కర్ర సహాయంతో నత్త పై షెల్ ని తొలగిస్తారు. తర్వాత నత్త గుల్లలో ఉన్న మాంసాన్ని సేఫ్టీ పిన్ సహాయంతో జాగ్రత్తగా బయటకు తీయాలి. ఇలా తీసిన నత్త మాంసాన్ని వాసన పోయేందుకు కొంచెం నూనె లో వేయించాలి. లేదా ముందుగా నత్త నుండి తీసిన మాంసాన్ని కాల్చాలి. దీని తరువాత ఒక బాణలిని స్టవ్ మీద పెట్టి తగినంత నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి తరువాత మీట్ మసాలా, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి ఉల్లిపాయలను బాగా వేయించాలి. తరువాత నత్త మాంసాన్ని ఉల్లిపాయ మసాలా మిశ్రమంలో వేసి తగినంత నీరు పోసి కొంతసేపు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర జల్లుకోవాలి. అంతే రుచికరమైన నత్త కూర సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ నత్త కూరతో అన్నం లేదా చపాతీని తినవచ్చు.

నత్త కూరతో ప్రయోజనాలు ఏమిటి?

శరీరంలోని అనేక సమస్యలకు కారణంగా కొన్ని విటమిన్ లోపాలు. విటమిన్ B6 , విటమిన్ A లతో పాటు మెగ్నీషియం, భాస్వరం, జింక్, ఇనుము, పొటాషియం నత్తల్లో భారీ మొత్తంలో కనిపిస్తాయి. ఇది పురుషులు , స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాదు ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు గుండె, మూత్రపిండాల వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. దీనితో పాటు పోషకాహార లోపం ఉన్న పిల్లలకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే నత్తల్లో ఐరెన్ అధికంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..