Dogs Barking: కొంతమంది చూసినప్పుడు మాత్రమే కుక్కలు ఎందుకు ఎక్కువగా మొరుగుతాయో తెలుసా..
కొన్నిసార్లు నిద్రపోతున్న కుక్కలు హటాత్తుగా మేల్కొని అరవడం ప్రారంభిస్తాయి. అయితే కుక్కలు అందరినీ చూసి మొరగవు. కొంతమందిని చూసినప్పుడు మాత్రమే ఎక్కువగా మొరుగుతాయి. ముఖ్యంగా చెత్త సేకరించేవారు, తాగి తిరిగే వారు, బిచ్చగాళ్ళు వంటి వారిని చూసినప్పుడు కుక్కలు విపరీతంగా మొరుగుతారు. దీనికి కారణం ఏమిటంటే..

కుక్కలు మనిషికి ప్రాణ స్నేహితులు. అయితే పెంపుడు కుక్కలు అయితే తమ యజమానిని తమ ప్రాంతం కంటే ఎక్కువగా ప్రేమిస్తాయి. మనుషుల్లాగే అవి ప్రవర్తిస్తాయి. అయితే వీధి కుక్కలు వేరు. ఇవి అందరితో స్నేహం చేయవు. అలాగని అందరినీ చూసి మొరగవు. కొంతమందిని చూసి మొరుగుతాయి. ఎంతగా అంటే వాళ్ళు తమ దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు అరుస్తారు.
కుక్కలు ఇంటికి కాపాలా కాస్తాయి. తమని పెంచుకునే ఇంటిలో కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తాయి. కుక్కలు కొంతమందిని చూసి ముఖ్యంగా చెత్త సేకరించేవారు.. తాగుబోతులను, బిచ్చగాళ్ళు వంటి వారిని చూసినప్పుడు విపరీతంగా మొరుగుతాయి. కుక్కలు మనుషుల ముఖ కవళికలను అర్థం చేసుకుంటాయి. కుక్కలు మానవ శరీర భాషను అర్థం చేసుకుంటాయి. ఎవరైనా తమ వైపు చూసిన వెంటనే లేదా తాము ఇబ్బందుల్లో ఉన్నట్లు గ్రహించిన వెంటనే కుక్కలు మొరగడం ప్రారంభిస్తాయి. అయితే ఆ సమయంలో కుక్కలకు దగ్గరికి ప్రేమగా వెళ్లి తలపై నిమిరితే.. కుక్క తోక ఊపుతూ మౌనంగా ఉంటుంది. కుక్కని మచ్చిక చేసుకోవడానికి ఆ కుక్క తెలియాల్సిన అవసరం లేదు.
కుక్క కొంతమంది చూసి అదే పనిగా మొరగడానికి మరొక కారణం గత సంఘటలు అయి కూడా ఉండవచ్చు. ఒక బిచ్చగాడు లేదా ఇతరులు వీధి కుక్కను తిట్టి ఉండవచ్చు లేదా కుక్కపై దాడి చేసి ఉండవచ్చు. లేదా కుక్క శరీరంలోని ఏదైనా భాగం మీదుగా కారు వెళ్లి ఉండవచ్చు. అలాంటి సంఘటలు జరిగిన తర్వాత ఎన్ని రోజులైనా సరే వారిని చుసిన వెంటనే మొరగడం మొదలు పెడుతుంది. కుక్క కారు చూడగానే మొరిగి దాని వెంట పరుగెత్తుతుంది.
కుక్కలు మానవ భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయి. కుక్కలు వాసనలను మాత్రమే కాదు మానవ భావోద్వేగాలను కూడా గ్రహించగలవు. ఎవరైనా భయపడినట్టు కుక్క గమనిస్తే వారిని ఇంకా భయపెడతాయి. మరోవైపు నమ్మకంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తిని చూస్తే తాము సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాయి.
వీధి కుక్కలకు కూడా వాటి సొంత భూభాగం ఉంటుంది. అవి తమ భూభాగాన్ని కాపాడుకుంటాయి. అవి తాము నివసించే చుట్టు పక్కల ప్రాంతాన్ని తమదిగా భావిస్తాయి. అక్కడికి ఎవరూ రాకుండా జాగ్రత్త పడతాయి. అందుకే అవి కొన్నిసార్లు మొరుగుతాయి.
అనవసరంగా మొరగడం ఎలా ఆపాలంటే కుక్కపిల్లలుగా ఉన్నప్పుడే వేర్వేరు వ్యక్తులకు పరిచయం చేయండి. తద్వారా అవి అపరిచితులను చూసి భయపడవు. కుక్కల పట్ల ప్రేమ చూపించండి. ఎవరి కుక్క అయినా విపరీతంగా మొరుగుతుంటే దాని దృష్టి మరల్చడానికి ఒక బొమ్మ ఇవ్వండి. వాటికి కొన్ని అలవాట్లు చేయడం ద్వారా మీరు ఏమిటి చెబుతున్నరనేది కుక్కలకు అర్ధం అవుతుంది.
మొరగడం అనేది కుక్క సంభాషించే మార్గం. మొరగడం అనేది కుక్క మాట్లాడే విధానం. అవి భయం, ఆందోళన ,అసౌకర్యాన్ని మొరగడం ద్వారా వ్యక్తం చేస్తాయి. కనుక కుక్క మొరిగే విధానం బట్టి అవి ఏమి చెబుతున్నారో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








