Phool Makhana Payasam: పూల్ మఖానా పాయసంలో పోషకాలు మెండు… తక్కువ సమయంలో రుచికరంగా ఎలా చేసుకోవాలంటే..
బెల్లం, పాలు, పూల్ మఖానా, సగ్గుబియ్యంతో చేసే ఈ పాయసం ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. పూజల్లో దేవుళ్లకు నైవేద్యంగానూ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వేసవిలో టీ, కాఫీలకు బదులుగా ఇదొక్క కప్పు తీసుకుంటే చాలు! పొట్టకు హాయిగా ఉండడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

ఇంట్లో చేసుకునే ఆహారం ఎప్పుడూ రుచికరం.. ఆరోగ్యకరం. కొన్ని రకాల సాంప్రదాయ వంటలను పండగలు, పూజ, ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసుకుంటారు. ముఖ్యంగా బియ్యంతో చేసుకునే పాయసం, సేమ్యా, బెల్లం తాళికలు, పాల ఉండ్రాళ్ళు వంటి రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేసుకుంటారు. అటువంటి వంటకాల్లో పోషకాల పాయసం.. పూల్ మఖానా పాయసం. తక్కువ సమయంలోనే నచ్చినప్పుడు చేసుకోవచ్చు. తక్షణ శక్తిని ఇచ్చే పోషకాల పూల్ మఖానా పాయసం రెసిపీ తెలుసుకుందాం..
రెగ్యులర్ ఆహారానికి బదులుగా పూల్ మఖనా తో చేసే పాయసం భిన్నమైన రుచితో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. పూజ సమయంలో మాత్రమే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ సమయంలోనే రుచికరంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా శరీరానికి శక్తి కావాలంటే ఈ పూల్ మఖనా పాయసం బెస్ట్ ఆప్షన్. శక్తి
కావల్సిన పదార్థాలు
పూల్ మఖానా – ఒక కప్పు
సగ్గు బియ్యం – అరకప్పు
పాలు – లీటరు
బెల్లం తురుము – అర కప్పు
నెయ్యి – మూడు స్పూన్లు
బాదం –
పిస్తా
యాలకుల పొడి
కుంకుమ పువ్వు
తయారీ విధానం: పుల్ మఖానా పాయసం చేసుకునే రెండు మూడు గంటల ముందు.. సగ్గు బియ్యాన్ని రెండు సార్లు కడిగి.. నీటిలో నానబెట్టుకోవాలి. ఇంతలో మిక్సీ గిన్నెలో బాదం పిస్తా, జీడి పప్పు, యాలకులు వేసి గ్రైండ్ చేసుకోండి. పాయసం చేసుకోవడానికి రెడీ అయ్యాక స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి పూల్ మఖానా వేసి తక్కువ మంట మీద వేయించుకోవాలి. తర్వాత ఇదే బాణలిలో పాలు పోసుకోవాలి. మరోవైపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి.. బెల్లం కొంచెం నీరు పోసి బెల్లం కరిగేలా రెండు నిముషాలు నీటిని మరిగించండి. ఇప్పుడు ఈ బెల్లం నీటిని ఒక పక్కుకు పెట్టుకోవాలి. మరుగుతున్న పాలల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించండి. ఇప్పుడే నాలుగు కుంకుమ రేకులు వేసి మిక్స్ చేయండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ ని వేసి బాగా కలపండి. అవసరం అయితే పాలల్లో కొంచెం నీరు పోసి మరిగించండి. ఇప్పుడు వేయించిన పూల్ మఖానా వేసి కలిపి స్టవ్ ఆపి పాయసం గిన్నెపై మూత పెట్టండి. కొంచెం సేపు తర్వాత ఈ పుల్ మఖానా పాయసం మిక్స్ లో కట్ చేసిన బాదం, జీడి పప్పు, పిస్తా ముక్కలు , కిస్ మిస్ వేసి కలపండి. తర్వాత బెల్లం నీరుని వడకట్టి పాయసంలో కలపండి. అంతే రుచికరమైన శక్తిని ఇచ్చే పూల్ మఖానా పాయసం రెడీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




