Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 3 చేపలు ఫ్రీగా ఇచ్చినా తినకండి.. కాదని కక్కుర్తి పడ్డారో మీ పని అంతే!

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అయితే, కొన్ని రకాల చేపలు మాత్రం ఆరోగ్యానికి మేలు చేయటం కాదు.. వాటిని తింటే అనారోగ్యం బారిన పడక తప్పదు. అలాంటి విషపూరిత చేపలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

ఈ 3 చేపలు ఫ్రీగా ఇచ్చినా తినకండి.. కాదని కక్కుర్తి పడ్డారో మీ పని అంతే!
The Fish We Don't Eat
Follow us
Jyothi Gadda

|

Updated on: May 06, 2025 | 5:00 PM

నాన్‌వెజ్‌ ప్రియులు చాలా మంది చేపల్ని ఇష్టంగా తింటూ ఉంటారు. చేప పులుసు, ఫ్రై, ఇగురు, ఫిష్ బిర్యానీ ఎలా రకరకాల వంటకాలు చేసుకుని తింటుంటారు. అయితే, చేపలు తినడం ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు కలిగిస్తుందని పోషకాహార నిపుణులు పదే పదే చెబుతుంటారు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అయితే, కొన్ని రకాల చేపలు మాత్రం ఆరోగ్యానికి మేలు చేయటం కాదు.. వాటిని తింటే అనారోగ్యం బారిన పడక తప్పదు. అలాంటి విషపూరిత చేపలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, కొన్ని రకాల చేపలు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కింగ్ మాకేరెల్‌లో పాదరసం స్థాయిలు అధికంగా ఉండటంతో ఇది నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.. పసిఫిక్ మహాసముద్రంలో ప్రత్యేకంగా కనిపించే ఈ కింగ్ మాకెరెల్‌లో అధిక మొత్తంలో పాదరసం కలిగి ఉంటుంది. పిల్లలు, గర్భిణులు తినకూడదట. వీటిని తినడం వల్ల కిడ్నీలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

బసా చేప..ఇది క్యాట్ ఫిష్ రకం. బసా ఫిష్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే హానికరమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారు ఈ చేపకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సార్డిన్.. ఇవి కూడా సముద్రపు చేపలు. ఇవి కూడా అధిక మొత్తంలో పాదరసం కలిగి ఉంటాయి. వీటితో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. వీటిని ఎక్కువ తింటే మెదడు ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.. చిన్న పిల్లలు, గర్బిణీ స్త్రీలు ఈ రకం చేపలకు దూరంగా ఉండాలి. నరాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. .

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..