Jaggery Rice : బెల్లం అన్నంతో బోలెడు లాభాలు.. తెలిస్తే రోజూ తింటారు..
చాలా మంది స్వీట్స్ తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా తినడం అస్సలు మంచిది కాదు..కానీ, స్వీట్ అంటే ఇష్టపడేవారు క్రమం తప్పకుండా బెల్లం అన్నం తింటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజు భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే జీర్ణ సమస్యలతో పాటు..శరీరంలో అనేక రోగాలను దూరం చేస్తుందని చెబుతున్నారు. ప్రతి రోజూ ఒక కప్పు బెల్లం అన్నం తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: May 06, 2025 | 10:59 AM

బెల్లంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి బెల్లం అద్భుతమేలు చేస్తుంది. బరువు తగ్గడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. బెల్లం తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు తోసేస్తుంది. బెల్లాన్ని ఉపయోగించి చేసే తీపి వంటకాలలో బెల్లం అన్నం కూడా ఒకటి

బెల్లం అన్నం తింటే శరీరానికి తగిన మోతాదులో శరీరానికి ఐరన్ లభిస్తుంది. ఇందులో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. ఇవి ఎముకల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే ఈ బెల్లం అన్నం తింటే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

బెల్లం అన్నం తింటే అందులో ఉండే పొటాషియం శరీరానికి లభించి.. రక్తపోటును నియంత్రిస్తుంది. ప్రతి రోజూ ఒక చిన్న ముక్క బెల్లం తిన్న కూడా దాని ఫలితం ఉంటుంది. అలసట తగ్గుతుంది. తక్షణ శక్తి లభిస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కీళ్లనొప్పులు, జాయింట్ పెయినస్‌తో బాధపడుతున్న వారికి బెల్లం, బెల్లం అన్నం తరచూ తీసుకోవటం మంచిది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు బలంగా ఆరోగ్యంగా మారతాయి. బెల్లంలోని గుణాలు జాయింట్ పెయిన్స్‌ని దూరం చేస్తుంది.

అలాగే ఇందులో బెల్లం అన్నం తినటం వల్ల శరీరానికి అవసరమైన ఫాస్పరస్ శక్తి ఉత్పత్తికి దోహదం చేస్తుంది. అలాగే బెల్లంలో లభించే మాంగనీస్, జింక్, రాగి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ బెల్లం అన్నం తినేవారు అతిగా తినకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు బెల్లం అన్నం తికపోవడం చాలా మంచిది.




