- Telugu News Photo Gallery Cinema photos Jr. NTR birthday treat to Meenakshi Chaudhary latest movie updates from film industry
Tollywood Updates: తారక్ బర్త్‌డేకి తీన్ ట్రీట్.. మీనాక్షి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం..
ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా వరుస అప్‌డేట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మూవీ బైసన్. బాలీవుడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సౌత్ బ్యూటీ మీనాక్షి చౌదరి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తన వెయిట్ లాస్ జర్నీని అభిమానులతో షేర్ చేసుకున్నారు రితికా సింగ్.
Updated on: May 06, 2025 | 11:07 AM

ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా వరుస అప్‌డేట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న రెండు సినిమాల నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ రానున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్‌తో పాటు, వార్ 2 గ్లింప్స్ రిలీజ్ కానున్నాయి. దేవర 2 అప్‌డేట్ కూడా రానుందన్న ప్రచారం జరుగుతోంది.

విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మూవీ బైసన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్.

బాలీవుడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. నార్త్ ఇండస్ట్రీలో క్రియేటివిటీ లోపించింది అన్నారు. బాలీవుడ్ మేకర్స్ ఇతర ఇండస్ట్రీల్లో సూపర్ హిట్ అయిన సినిమాల నుంచి సీన్స్ కాపీ చేస్తున్నారని విమర్శించారు. ఈ పద్దతి వల్లే మంచి కథలు అందించే అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యారన్నారు నవాజ్.

సౌత్ బ్యూటీ మీనాక్షి చౌదరి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. స్త్రీ, మిమీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించిన నిర్మాత దినేష్ విజయన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్స్‌లో మీనాక్షి లీడ్ రోల్‌లో నటించబోతున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఈ బ్యూటీ నార్త్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

తన వెయిట్ లాస్ జర్నీని అభిమానులతో షేర్ చేసుకున్నారు రితికా సింగ్. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రితికా.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఇంట్రస్టింగ్ సినిమాలు చేశారు. కొద్ది రోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ కాస్త లావయ్యారు. ఎంతో కష్టపడి మళ్లీ స్లిమ్‌లుక్‌లోకి మారారు. తన ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు.




