- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi Jagadeka Veerudu Athiloka Sundari to Rajinikanth latest movie news from cinema news
Tollywood News: జగదేక వీరుడు రీ రిలీజ్ కష్టాలు.. తలైవా రిటైర్మెంట్..
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది చిత్రయూనిట్. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా.. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే చర్చ జరుగుతోంది. లెనిన్ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్య, తమ్ముడు కార్తీని ఆకాశానికెత్తేశారు.
Updated on: May 06, 2025 | 11:40 AM

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా సినిమా ప్రింట్ రిస్టోరేషన్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోయిన జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9న రీ రిలీజ్ కానుంది.

చుండూరు మారణకాండపై ‘మల్లేశం’ దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన సినిమా ‘23’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి 3 పాటలు విడుదలయ్యాయి. తాజాగా చెరసాల అంటూ సాగే మరో పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా.. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే చర్చ జరుగుతోంది. సెట్స్ మీద ఉన్న జైలర్ 2 తరువాత రజనీ చేయబోయే సినిమా ఏంటన్నది ఇంత వరకు ప్రకటించలేదు. దీంతో రిటైర్మెంట్ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో లతా రజనీకాంత్ కూడా నాకు సమాధానం తెలియనదని చెప్పటంతో ఫ్యాన్స్ మరింత కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.

లెనిన్ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అఖిల్ హీరోగా మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభించనున్నారు. ఆ షెడ్యూల్‌లో ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను సిద్ధం చేశారు. లెనిన్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్య, తమ్ముడు కార్తీని ఆకాశానికెత్తేశారు. తాను ఎప్పటికీ కార్తి కాలేనన్న సూర్య, సత్యం సుందరం లాంటి సినిమా తాను చేయలేనన్నారు. రీసెంట్‌గా రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య, నెక్ట్స్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.




