- Telugu News Photo Gallery Cinema photos Do You Know These South Indian Celebrities Who Rejects Bollywood Movie Offers, Anushka Shetty To Nithya Menon
Tollywood: బాలీవుడ్ సినిమా ఆఫర్స్ రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ వీళ్లే.. అనుష్క నుంచి నిత్యా మీనన్ వరకు..
సౌత్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నటనతో సినీప్రియులను కట్టిపడేసి.. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వచ్చినప్పటికీ ఎంతోమంది బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేశారు. ఇంతకీ ఎవరెవరు హిందీ సినిమాలను రిజెక్ట్ చేశారో తెలుసా.. ?
Updated on: May 06, 2025 | 11:47 AM

దక్షిణాదిలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సెలబ్రెటీల గురించి చెప్పక్కర్లేదు. అయితే సౌత్ సినిమాల్లో ఫేమస్ అయినప్పటికీ హిందీ ఆఫర్స్ సున్నితంగా రిజెక్ట్ చేసిన సెలబ్రెటీల గురించి మీకు తెలుసా.. ? దక్షిణాది సినిమాల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. సౌత్ సినిమా పరిశ్రమ అత్యుత్తమమని నమ్మి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు కొంతమంది ప్రముఖులు. ఇంతకీ బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్ గుర్తింపు సంపాదించుకున్నారు అనుష్క శెట్టి. ఆ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంది. కానీ ఆమె వాటన్నింటినీ తిరస్కరించి తెలుగు, తమిళం సినిమాల్లోనే కొనసాగింది. నిజానికి అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్స్ వచ్చినప్పటికీ హిందీ సినిమాలు చేసేందుకు అనుష్క ఆసక్తి చూపించలేదు.

తమిళ హీరో కార్తి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తమిళంతోపాటు తెలుగులో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హిందీలో మాత్రం ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశారు. తాను తమిళ చిత్ర పరిశ్రమలోనే ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తమిళంలో తనకు వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు.

1998లో హనుమాన్ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నిత్యా మీనన్. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో కథానాయికగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయింది. ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ తాను దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

సూర్య సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే రెట్రో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే సూర్యకు గతంలో చాలా సార్లు హిందీ సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ సున్నితంగా రిజెక్ట్ చేశారు సూర్య.

విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ చియాన్. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనకు హిందీలో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ సున్నితంగా రిజెక్ట్ చేశారు.




