Andhra Pradesh: నంద్యాల జిల్లలో పెద్దపులి కలకలం.. ఆవులపై వరస దాడులు.. కన్నీరు పెడుతున్న రైతన్నలు
పెద్ద పులులు చిరుతల దెబ్బకు రైతులు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా పశువులు ఉన్న రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రజల కంటికి నిద్ర లేకుండా పోతుంది ఎప్పుడు ఎటువైపు నుంచి పెద్దపులిలో చిరుతను దాడి చేస్తాయేమోనని భయం వెంటాడుతూ ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడ్డాయి.

నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులో వాట్సాప్ పెద్దపులి దాడులతో ఆవుల రైతులు బెంబేలెత్తుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున మద్రాస్ కాల్వ సమీపంలో ఆవుల మందపై పెద్ద పులి వరుస దాడులు చేసింది సోమవారం తెల్లవారుజామున పెద్దపులి దాడి చేసి ఐదు సంవత్సరాల ఆవును చంపగా మంగళవారం తెల్లవారుజామున మరో దూడను చంపింది. వెలుగోడు పట్టణానికి చెందిన సేవానాయాక్ రైతు ఆవు మందపై వరుస దాడి చేసి దాడి చేసి దూడను చంపింది పెద్దపులి.
వరుసగా రెండు రోజులు ఒకే రైతు ఆవుల మందపై పెద్ద పులి దాడి చేయడంతో రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం తెల్లవారుజామున పెద్దపులి దాడి చేసి ఆవును చంపడంతో ఆవుల రైతులు ఆవులను మరో ప్రాంతానికి మార్చి వేరే పొలంలో కట్టేయగా మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చి ఆవుల మందపై దాడి చేసి దూడను చంపింది. రాత్రి ఆవులు మందపై దాడికి వచ్చిన పెద్దపులిని ఆవుల రైతులు తమ సెల్ ఫోన్లలో పెద్దపులిని చిత్రీకరించి కేకలు వేయడంతో పెద్దపులి పారిపోయింది
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




