AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakolat Waterfall: ప్రకృతి అందాలకు నెలవు ఈ జలపాతం.. కృష్ణుడు తన రాణులతో కలిసి స్నానం చేసేవాడట..

ప్రకృతిలోని అందమైన సరస్సు, పర్వతాలు, అడవు, జలపాతాల సొగసులు ఆకట్టుకుంటూనే ఉంటాయి. అయితే మనదేశంలోని అందమైన ప్రదేశాల్లో అనేక రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. కొన్ని పురాణ కథలతో ముడిపడి ఉన్నాయి. అటువంటి అందమైన జలపాతం ఒకటి బీహార్ లోని నవాడాలో ఉన్న కాకోలాట్ జలపాతం. ఇది ప్రకృతి కళాత్మకతకు అద్భుతమైన ఉదాహరణ. ఒక జానపద కథ ప్రకారం శ్రీ కృష్ణుడు తన రాణులతో కలిసి ఇక్కడ స్నానం చేయడానికి వచ్చేవాడట. ఇది పర్యాటకులకు ఒక అద్భుతమైన ప్రదేశం.

Kakolat Waterfall: ప్రకృతి అందాలకు నెలవు ఈ జలపాతం.. కృష్ణుడు తన రాణులతో కలిసి స్నానం చేసేవాడట..
Kakolat Waterfall
Surya Kala
|

Updated on: May 06, 2025 | 7:04 PM

Share

ప్రకృతి ప్రేమికులా, ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించాలనుకుంటున్నారా బీహార్‌లోని నవాడ జిల్లాలో ఉన్న కాకోలాట్ జలపాతాన్ని తప్పక సందర్శించండి. ఈ అందమైన జలపాతంలోని నీరు సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతుంది. దీని చుట్టూ పచ్చని అడవులు, కొండలు ఉన్నాయి. దీంతో ప్రకృతి అందానికి పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసిన వారి హృదయం ఉప్పొంగిపోతుంది. కకోలాట్ జలపాతం నవాడ నుంచి దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. బీహార్ .. జార్ఖండ్ సరిహద్దులో ఉన్న ఈ జలపాతం ప్రకృతి కళాత్మకతకు అద్భుతమైన ఉదాహరణ.

ఇది మనిషి ఎంత అందంగా ఎన్నిటిని సృష్టించినా.. అది ప్రకృతి సృష్టికి దగ్గరగా కూడా రాలేదని మనకు చెబుతుంది. ఈ జలపాతం నీరు ఎత్తు నుంచి కింద పడుతుంటే చూడడం ఓ అద్భుతంగా ఉంటుంది. మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ జలపాతం భారతదేశంలోని అత్యుత్తమ జలపాతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని నీరు ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. చైత్ర మాసంలోని సంక్రాంతి రోజున ఈ ప్రదేశంలో ఒక జాతర నిర్వహిస్తారు.

జలపాతంతో సంబంధం ఉన్న ఒక పురాణ కథ ఏమిటంటే

ఇవి కూడా చదవండి

పురాణాల ప్రకారం త్రేతా యుగంలో ఒక ఋషి ఒక రాజును కొండచిలువ రూపాన్ని ధరించి ఇక్కడ నివసించమని శపించాడు. అప్పటి నుండి రాజు శాపం ప్రకారం ఈ ప్రదేశంలో నివసిస్తున్నాడు. పాండవులు తమ వనవాస సమయంలో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు రాజుకు ఈ జలపాతంలో స్నానం చేయడంతో శాపం నుంచి విముక్తి లభించింది. అప్పటి నుంచి భక్తులు ఈ జలపాతం నీటిలో స్నానం చేసే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ ప్రదేశంతో ముడిపడి ఉన్న ఒక జానపద కథ కూడా ఉంది. దాని ప్రకారం కృష్ణుడు తన రాణులతో కలిసి స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చేవాడు. ఈ కారణంగా కూడా ఈ జలపాతం నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు.

ఎలా వెళ్ళాలంటే

వాయు మార్గం: జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.

రైలు మార్గం: నవాడ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. నవాడ నేరుగా లఖిసరై .. గయ రైల్వే స్టేషన్లలో దిగాల్సి ఉంటుంది.

రోడ్డు మార్గం: నవాడ సమీప ప్రదేశాలకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..