AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇష్టం అంటూ మామిడి పండ్లు తెగ తినేస్తున్నారా.. ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసా..

పండ్లలో రారాజు అయిన మామిడి వేసవిలో లభించే పండు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మామిడి పండుని తినడానికి అందరూ ఇష్టపడతారు. రకరకాల రుచులతో దొరికే మామిడి పండు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే మామిడి పండుని తినే సమయంలో కొన్ని తప్పులు చేస్తే ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. ఈ రోజు మామిడి పండ్లు తినే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

ఇష్టం అంటూ మామిడి పండ్లు తెగ తినేస్తున్నారా.. ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసా..
Eating Mangoes Safely
Surya Kala
|

Updated on: May 06, 2025 | 4:44 PM

Share

వేసవిలో పుచ్చకాయ, ద్రాక్ష, కర్భుజ వంటి అనేక రకాల పండ్లు లభిస్తాయి. అంతేకాదు పండ్లకి రాజు మామిడి పండు కూడా ఈ సీజన్ లోనే దొరుకుంతుంది. దీని కారణంగా ప్రజలు వేసవి కాలం కోసం వేచి ఉంటారు. తీపి, రసము, సువాసనగల మామిడిపండ్లను చూసిన వెంటనే తినాలని అనిపిస్తుంది. మామిడిలో విటమిన్ ఎ, బి6, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి, చర్మానికి చాలా మేలు చేస్తాయి. అన్ని వయసుల వారు మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. అయితే మామిడి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలుసా..! లేకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

మామిడి పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నప్పటికీ స్వభావం వేడిగా ఉంటుంది. కనుక మామిడి పండుని కడిగిన వెంటనే తింటే.. కోసుకుని తింటే మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మామిడి పండుని తినడానికి ముందు దానిని 3-4 గంటలు నీటిలో నానబెట్టాలి.

మామిడి పండ్లు ఎక్కువగా తినకండి..

మామిడి పండుని పరిమిత పరిమాణంలో తినాలి. లేకుంటే అది ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. ఒక రోజులో 2 నుంచి 3 మామిడి పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. ఎందుకంటే మామిడి పండుని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి, చర్మానికి హాని కలిగిస్తుంది. మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల ముఖం మీద మొటిమలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది.

మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల చర్మంపై మాత్రమే కాదు జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. దీని కారణంగా అతిసారం అంటే విరేచనాలు వంటి కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు.

ఖాళీ కడుపుతో మామిడిపండు తింటే

మామిడిపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే మామిడిలో అధిక మొత్తంలో ఫైబర్, చక్కెర ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. అసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ వంటి సమస్యలు రావచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం

మామిడి పండులో చాలా సహజ చక్కెర ఉంటుంది. దీని కారణంగా మామిడి పండుని ఎక్కువ మొత్తంలో తింటే రక్తంలో చక్కెర స్థాయిని పెరుగుతుంది. కనుక మధుమేహ రోగులు మామిడి పండుకి దూరంగా ఉండాలి. ఎందుకంటే దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53
3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం