- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips For Placing Rose Plant:These Directions Ensure Positive Energy at Home in telugu
Vastu Tips for Rose Plant: లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఇంట్లో గులాబీ మొక్కలను ఏ దిశలో పెంచుకోవాలంటే..
ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలో వాస్తు నియమాలను పాటించాలని అప్పుడే ఆ ఇంట్లో నివారించే వారికీ సుఖ సంతోషాలు ఉంటాయని.. ఆర్ధిక సమస్యలు ఉండవని నమ్మకం. అందమైన గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుకోవడానికి కూడా వాస్తు నియమాలున్నాయి. గులాబీలు అందమైనవి మాత్రమే కాదు ఔషధ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో గులాబీ మొక్కలు పెంచుకుంటే ఇంటి నుంచి ప్రతికూల శక్తులను నివారిస్తాయి. ఈ రోజు వాస్తు ప్రకారం ఇంట్లో గులాబీ మొక్కలను ఎక్కడ పెట్టుకొవాలో తెలుసుకుందాం..
Updated on: May 06, 2025 | 4:18 PM

గులాబీలు అందం, సువాసనతో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. ప్రతి ఇంట్లో కనిపించే, ఇష్టపడే పువ్వులలో ఒకటి. గులాబీ మొక్క ముళ్ళ మొక్క అయినా సరే.. గులాబీ పువ్వులు అందంగా ఉండి కనువిందు చేస్తాయి. ఈ గులాబీ పువ్వుల్లో అనేక రకాలున్నాయి. అయితే ఇంట్లో గులాబీ రంగు, ఎరుపు రంగు, తెలుపు గులాబీ కనిపిస్తాయి. పురాతన శాస్త్రమైన వాస్తు శాస్త్రం ప్రకారం కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం నిషేధం. అయినా సరే గులాబీ మొక్కకు మినహాయింపు ఉంది. అంతేకాదు గులాబీ మొక్కను పెంచుకోవడానికి కొన్ని వాస్తు నియమాలున్నాయి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో నైరుతి దిశలో గులాబీ మొక్కలను ఉంచడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. గులాబీ వంటి పుష్పించే మొక్కలను ఇంటి నైరుతి మూలలో పెంచాలి.

అయితే ఎరుపు రంగు గులాబీ పువ్వులను లేదా ఎరుపు రంగుపుష్పాల మొక్కలను పెంచుకోవడానికి దక్షిణం కూడా మంచి దిశ. ఇది ఇంటి యజమాని సామాజిక ప్రతిష్టను పెంచుతుందని భావిస్తారు.

కొంతమంది గులాబీ మొక్కలను ఇంట్లో కూడా పెంచుకుంటారు. అయితే ఇలా ఇంటి లోపల గులాబీ మొక్కను ఉంచినప్పుడు సూర్య కాంతి పడేలా పెట్టాలి. గులాబీ మొక్కలు వికసించడానికి ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. కనీసం ఆరు గంటల పాటు గులాబీ మొక్కకు సూర్యకాంతి అవసరం. దక్షిణ లేదా పశ్చిమానికి ఎక్స్పోజర్ ఉన్న కిటికీల్లో గులాబీ మొక్కలను పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇంటి లోపల గులాబీ మొక్కలు ఉంటే సాలీడు పురుగులు ఉండే అవకాశం ఉంది. కనుక గులాబీ మొక్కలను సాలెపురుగులకు దూరంగా ఉంచండి. నీటితో తడిసిన గులకరాళ్ళ ట్రే పైన గులాబీ మొక్కను ఉంచండి. నీరు ఆవిరైపోతున్న కొద్దీ తేమ పెరుగుతుంది.

వాస్తు శాస్త్రంలో గులాబీ మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. గులాబీని ప్రేమకు చిహ్నంగా చెబుతారు. మరోవైపు జ్యోతిషశాస్త్రంలో గులాబీ పువ్వు లక్ష్మీ దేవికి చిహ్నంగా సూచిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గులాబీలు నాటడం వల్ల డబ్బు కొరత ఉండదు

దంపతుల మధ్య ప్రేమ సరిగ్గా లేకపోతే తమ పడకగదిలో గాజు పాత్రలో గులాబీ మొక్కను ఉంచుకోవాలి. నీటిని ప్రతిరోజూ మార్చాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య కలత తీరి ప్రేమ మళ్లీ మొదలవుతుంది.




