Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశద్రోహం కేసు పెట్టండి.. కరాచీ బేకరీల పేర్లు తొలగించాలంటూ ఆందోళన..!

భారత్‌ కదన కుతూహలం.. పాకిస్తాన్‌ భయకంపితం. రెండుదేశాల బోర్డర్‌కు అటూఇటూగా ఉన్న సీన్‌ ఇది. పహల్గామ్‌లో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులతోపాటు దాని వెనుక ఉన్న పాకిస్తాన్‌‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. భారత్‌ ఏం చేస్తుందో అన్న భయం పాక్‌ పాలకులను, పాక్‌ సైన్యాన్ని పట్టి పీడిస్తోంది.

దేశద్రోహం కేసు పెట్టండి.. కరాచీ బేకరీల పేర్లు తొలగించాలంటూ ఆందోళన..!
Karachi Bakery
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Balaraju Goud

Updated on: May 06, 2025 | 8:30 PM

భారత్‌ కదన కుతూహలం.. పాకిస్తాన్‌ భయకంపితం. రెండుదేశాల బోర్డర్‌కు అటూఇటూగా ఉన్న సీన్‌ ఇది. పహల్గామ్‌లో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులతోపాటు దాని వెనుక ఉన్న పాకిస్తాన్‌‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. భారత్‌ ఏం చేస్తుందో అన్న భయం పాక్‌ పాలకులను, పాక్‌ సైన్యాన్ని పట్టి పీడిస్తోంది.

పహల్గామ్‌లో పాక్ ముష్కరులు అమాయకులైన భారతీయులను పొట్టనబెట్టుకోవడాన్ని యావత్ భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ పేరు వింటేనే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థాన్‌కు చెందిన కరాచీ పేరుతో ఉన్న బేకరీల పేర్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి కదం తొక్కింది. ఈ క్రమంలోనే విశాఖపట్నం వెంకోజిపాలెం పెట్రోల్ బంక్ డౌన్‌లో ఉన్న కరాచీ బేకరీ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది.

పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా భారతీయులను చంపేస్తుంటే.. పాకిస్తాన్ మూలాలు గల కరాచీ బేకరీల పేర్లతో ఊరేగడం సబబు కాదని జనజాగరణ సమితి నాయకులు మండిపడ్డారు. యాజమాన్యం పది రోజుల్లోగా దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీల పేర్లను తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. హిందూ జాతీయవాద సంస్థలు బేకరీ వ్యాపారానికి వ్యతిరేకం కాదని కేవలం పాకిస్తాన్ దేశంలో గల కరాచీ ప్రాంతం పేరుతో భారతదేశంలో బేకరీలు నడపడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామన్నారు. పాకిస్తాన్ లో భారతదేశ మూలాలు గల బెనారస్ బేకరీ పేరుతో వ్యాపారం చేస్తే ఆ దేశ ప్రజలు ఏమాత్రం సహించరని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల్లోగా కరాచీ బేకరీల పేర్లను తొలగించకపోతే కేంద్ర ప్రభుత్వం స్పందించి యాజమాన్యంపై దేశద్రోహం కేసులు నమోదు చేసి కరాచీ బేకరీలన్నిటిని సీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే, పహల్గామ్ ఉగ్రదాడిలో విశాఖపట్నం నివాసి, రిటైర్డ్ బ్యాంక్ అధికారి జె.ఎస్. చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు.

మామూలుగా కరాచీ బేకరి ఐటమ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అంతలా మనలో ఒక్కటైపోయింది కరాచీ బేకరి. 1953లో ఖుబ్చంద్ రామనాణి అనే సింధీ వ్యాపారి హైదరాబాద్‌లో ఓ చిన్న దుకాణం ఏర్పాటు చేశాడు. అతను సింధ్ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయాడు. అతని స్వస్థలం కరాచీ. అప్పట్లో సింధ్ భారత్‌లోనే ఉండేది. 1947లో దేశ విభజన తర్వాత అది పాకిస్తాన్‌లో భాగమైంది. కరాచీలో ఉండే సింధీ సంస్కృతి, రుచులను తన బేకరీలో ప్రతిబింబించాలని అందుకే బేకరీకి “కరాచీ బేకరీ” అని పేరు పెట్టాడు.

1960నాటికి కరాచీ బేకరీ హైదరాబాద్‌లో ఓ బ్రాండ్‌గా మారింది. ఖుబ్చంద్ కుటుంబం బేకరీని మరింత విస్తరించింది. కేకులు, చాక్లెట్స్, బ్రెడ్‌లు లాంటివి కూడా ఇక్కడ తయారయ్యేవి. కానీ ఫ్రూట్ బిస్కెట్స్ మాత్రం ఎప్పటికీ స్పెషల్. ఈ బిస్కెట్స్‌ని భారతదేశం నలుమూలలకూ పంపడం మొదలైంది. హైదరాబాద్‌కి వచ్చిన టూరిస్టులు కరాచీ బేకరీ బిస్కెట్స్‌ని గిఫ్ట్‌గా తీసుకెళ్లడం ఒక ట్రెండ్ గా మారింది. కరాచీ బేకరీ విజయంలో మరో కీలక విషయం ఏంటంటే, క్వాలిటీ. క్వాలిటీ డ్రై ఫ్రూట్స్, బటర్, ఇతర పదార్థాలను వాడేవాళ్లు. అంతేకాదు, సింధీ సంస్కృతిలో ఉండే ఆతిథ్యాన్ని కూడా ఈ బేకరీలో చూడొచ్చు. కస్టమర్లతో స్నేహపూర్వకంగా ఉండటం, వాళ్లకు బెస్ట్ రుచి ఇవ్వడం వీళ్ల స్టైల్. ఈ కారణంగానే ఈ బేకరీకి లాయల్ కస్టమర్లు ఏర్పడ్డారు.

కానీ ఈ బేకరీపై కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. 2022లో హైదరాబాద్‌ కరాచీ బేకరీ బ్రాంచ్‌లో మిఠాయి చెడిపోయిందని ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి, పరిశుభ్రత సమస్యలు ఉన్నాయని జరిమానా విధించారు. 2023లో రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలి 15 మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఇప్పుడు యుద్ధం నేపధ్యంలో విశాఖపట్నంలో కరాచీ బేకరీ పేరు మార్చాలని ఆందోళనలు జరుగుతున్నాయి. కరాచీ అనే పేరు పాకిస్తాన్‌కు చెందినదని ..ఇది భారత్‌లో ఉండడం సరైనది కాదన్నది వాళ్ల వాదన. పది రోజుల్లో పేరు మార్చకపోతే దేశద్రోహం కేసు పెడతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బేకరీ పేరు ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. మరి పేరు మారుస్తారా…లేదా అన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది