AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నదీ పరివాహక ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు.. కారణం అదేనా?

ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జనం ఇళ్ళల్లో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. పొదిలి, ముండ్లమూరు, దర్శి మండలాల్లో ఉదయం రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు గుర్తించారు. దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో ఆరు నెలల క్రితం వరుసగా మూడు రోజుల పాటు భూమి కంపించింది.

Andhra Pradesh: నదీ పరివాహక ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు.. కారణం అదేనా?
Earthquake
Fairoz Baig
| Edited By: |

Updated on: May 06, 2025 | 6:41 PM

Share

ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జనం ఇళ్ళల్లో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. పొదిలి, ముండ్లమూరు, దర్శి మండలాల్లో ఉదయం రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు గుర్తించారు. దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో ఆరు నెలల క్రితం వరుసగా మూడు రోజుల పాటు భూమి కంపించింది. దీంతో ఆ మూడు రోజులు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.

తాజాగా పొదిలి, దర్శి, ముండ్లమూరు మండలాల్లోని పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. తరచూ ఈ ప్రాంతాల్లోనే భూమి కంపించడంపై అధికారులు పరిశోధనలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అయితే గతంలో దర్శి ప్రాంతంలో సంభవించిన భూ ప్రకంపనలపై అధికారులు పరిశోధనలు చేశారు. గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలోని భూముల్లో పొరలు సర్దుబాటు అవుతుంటాయని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో భూమి లోపలి పొరలు సర్దుబాటు అయ్యే సమయంలో ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు తేల్చారు.

ఇప్పుడు కూడా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే పొదిలి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రకంపనాలు సాధారణంగా నదీపరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో జరుగుతుంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?