- Telugu News Photo Gallery Period Bloating Problem: Tired of Period Bloating? Here's How to Manage It
Period Bloating: ఆ సమయంలో భరించలేని కడుపు నొప్పి వేధిస్తుందా? ఇలా చేస్తే చిటికెలో రిలీఫ్..
చాలా మంది అమ్మాయిలకు పీరియడ్స్ సమయంలో భరించలేనంత కడుపు నొప్పి వేధిస్తుంది. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో శరీరాలలో అనేక సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాంటి సమయాల్లో వచ్చే సమస్యల్లో ఒకటి గ్యాస్ సమస్యలు. చాలా మందికి పీరియడ్స్ ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు..
Updated on: May 06, 2025 | 9:08 PM

ఫెలోపియన్ నాళాలు.. స్త్రీలలో అండాశయాలు, గర్భాశయం మధ్య అనుసంధాన నాళాలు ఇవి. చాలా మంది మహిళలకు ఈ గొట్టాలలో అడ్డంకులు రావడంతో విపరీతమైన కడుపు నొప్పితో అల్లాడిపోతుంటారు. వైద్య పరిభాషలో దీనిని హైడ్రోసాల్పిన్క్స్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? నివారణ ఎలా ఉంటుంది? నిపుణులు ఏమంటున్నారు? వంటి వివరాలు మీ కోసం..

చాలా మందికి ఋతుస్రావం ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు లేదా ఋతుస్రావం సమయంలో శరీరం అసౌకర్యంగా అనిపించడం, కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కొన్ని ఆహారాలు తినడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

పీరియడ్స్ సమయంలో బాదం తినవచ్చు. ఇందులో మెగ్నీషియం ఉంటుంది. ఇది అపానవాయువు, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే దిగువ ఉదర కండరాలలో ఉద్రిక్తతను తగ్గిస్తుంది. అవకాడో, చిలగడదుంప, పాలకూర, అరటిపండ్లు వంటి కూరగాయలు, పండ్లు పీరియడ్స్ సమయంలో గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం అధికంగా కలిగిన పండ్లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో సోడియం పేరుకుపోదు. కడుపు ఉబ్బరం కూడా ఉండదు. పీరియడ్స్ సమయంలో అల్లం టీ తాగడం వల్ల వివిధ జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్ సమస్య తలెత్తదు. కానీ అల్లం టీ మాత్రమే కాదు, పుదీనా ఆకుల టీ కూడా తాగవచ్చు. ఇది పీరియడ్స్ సమయంలో గ్యాస్ సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

పీరియడ్స్ సమయంలో లేదా ముందు డార్క్ చాక్లెట్ నుంచి ఆపిల్,వివిధ బెర్రీల వరకు ఏదైనా తినవచ్చు. ఇవి గ్యాస్ సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. పీరియడ్స్ సమయంలో ఓట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా తినవచ్చు. అప్పుడు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు.




