AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చియా సీడ్స్‌ తింటున్నారా..? వీటితో కలిపి తిన్నారో ఇక సంగతులు..! ఆరోగ్యం డేంజర్ లో పడినట్టే

చియా సీడ్స్.. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన శక్తివంతమైన పోషకాల భాండగారంగా పిలుస్తారు. చియాలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి. కానీ వాటిని కొన్ని పదార్థాలతో కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి, ఈ ఆరోగ్యకరమైన విత్తనాలను తినడానికి సరైన మార్గం ఏంటో తప్పక తెలుసుకోవాలి.

చియా సీడ్స్‌ తింటున్నారా..? వీటితో కలిపి తిన్నారో ఇక సంగతులు..! ఆరోగ్యం డేంజర్ లో పడినట్టే
Chia Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 27, 2025 | 7:25 PM

చియా విత్తనాలు చాలా ఆరోగ్యకరమైనవి. పోషకమైనవి. వాటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి1, బి3 పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె, ఎముకలకు ప్రయోజనకరమైన ఆహారంగా పరిగణిస్తారు. చియా సీడ్స్ పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. కానీ, ఈ విత్తనాలను కొన్నిరకాల పదార్థాలతో కలిపి ఎప్పుడూ తినకూడదు. దీనివల్ల శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ చక్కెర:

అధిక చక్కెర శాతం ఉన్న వాటితో కలిపి చియా సీడ్స్ తినకూడదు. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో చియా విత్తనాల ప్రయోజనాలను పొందడంలో ఇబ్బంది, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అదనపు ఉప్పు:

చక్కెర లాగే, ఉప్పు కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల సోడియం తీసుకోవడం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. దీని వల్ల అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అధిక కొవ్వు:

సలాడ్‌లో చియా విత్తనాలను తినేటప్పుడు, దానితో పాటు అనారోగ్యకరమైన నూనె, వెన్న లేదా అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తినవద్దు. అలా చేయడం వల్ల చియా విత్తనాలలో కనిపించే ఆరోగ్యకరమైన కొవ్వుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండెకు హాని కలిగిస్తుందని చెబుతున్నారు.

మసాలా ఆహారం:

చియా గింజలతో కారం, నల్ల మిరియాలు మొదలైనవి కలిపి తీసుకోవడం కూడా సరైనది కాదు. ఇలా తినటం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.

నట్స్‌,సీడ్స్‌:

చియా విత్తనాలను నట్స్, సీడ్స్ వంటి పదార్థాలతో కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి కడుపులోకి చేరి పొట్టలో నీటిని పీల్చేసుకుంటాయి. దీనివల్ల కడుపు నొప్పి, బరువు పెరగటం, పొట్టలో వాయువు ఏర్పడతాయి. అందుకే వాటిని నానబెట్టిన తర్వాత తినడం ఎల్లప్పుడూ మంచిదని చెబుతున్నారు.

కృత్రిమ తీపి పదార్థాలు:

ఐస్ క్రీం, స్మూతీ మొదలైన వాటిలో కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. అలాంటప్పుడు చియా సీడ్స్‌ని వాటిలో కలిపి తినవద్దు. ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది. రక్తంలో చక్కెరను పెంచుతుంది.

ప్యాక్ చేసిన జ్యూస్‌లు:

చియా సీడ్స్‌ని ప్యాక్ చేసిన జ్యూస్‌లతో కూడా కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మొత్తం చక్కెర శాతం పెరుగుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు హాని కలిగించవచ్చు .

చియా విత్తనాలను ఎలా తినాలి?

చియా విత్తనాలను తినడానికి ముందు కనీసం 20-30 నిమిషాలు నీటిలో లేదా పాలలో నానబెట్టాలి. దీనివల్ల వాటి జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఒకరు 1-2 చెంచాలు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..