Flax Seeds Benefits : అవిసె గింజలను ఇలా తింటేనే ఆరోగ్యానికి అద్భుతాలు.. లేదంటే..
ఫైబర్, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు ఆకలిని నియంత్రిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. అవిసె గింజల్లో అపారమైన పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవిసె గింజలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, అవిసెల ప్రయోజనం పొందడానికి వాటిని ఎలా తినాలో చాలా మందికి తెలియదు. కానీ, వీటిని

అవిసె గింజల్లో అపారమైన పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవిసె గింజలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, అవిసెల ప్రయోజనం పొందడానికి వాటిని ఎలా తినాలో చాలా మందికి తెలియదు. కానీ, వీటిని వేయించి, మెత్తగా పొడి చేసుకుని తినాలని నిపుణులు చెబుతున్నారు. దొరగా వేయించిన అవిసె గింజలు ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ కంటే తక్కువేం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేయించిన అవిసెలతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అవిసె గింజలు శరీరానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శక్తిని అందిస్తాయి. వేయించిన అవిసె గింజలను తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే, ప్రతి ఉదయం, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలను తింటే ఫలితం ఉంటుంది. అవిసె గింజలను వేయించి తీసుకుంటే గుండె జబ్బులను నివారించవచ్చు. ఈ విత్తనాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
వేయించిన అవిసె గింజల వినియోగం డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. అవిసె గింజలలో ఫైబర్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. మీకు అజీర్ణ సమస్యలు ఉంటే, మీరు కాల్చిన అవిసె గింజల పొడిని తినవచ్చు. అవిసె గింజలు గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తొలగిస్తాయి.
రోజూ ఒక చెంచా వేయించిన అవిసె గింజలను తీసుకుంటే మీ బరువును సులభంగా నియంత్రించవచ్చు. ఫైబర్, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు ఆకలిని నియంత్రిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. దీంతో బరువును నియంత్రిస్తాయి. మధుమేహ రోగులు ప్రతిరోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిని సులభంగా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. దీంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. మధుమేహాన్ని సాధారణంగా ఉంచుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..