AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helmet: వేసవి చెమటకు హెల్మెట్‌ చిరాకు పెట్టిస్తుందా? ఇలా చేశారంటే ఫుల్ హ్యాపీస్..

బైక్‌ రైడింగ్‌ చేసే వారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కానీ ఈ మండే ఎండలో హెల్మెట్ ధరించి బైక్ నడపడం కష్టమైన పని. ఎండ వేడిలో హెల్మెట్ ధరించడం వల్ల తలకు చెమట పట్టి, అసౌకర్యంగా అనిపిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతుంటారు..

Helmet: వేసవి చెమటకు హెల్మెట్‌ చిరాకు పెట్టిస్తుందా? ఇలా చేశారంటే ఫుల్ హ్యాపీస్..
Helmet In Summer
Srilakshmi C
|

Updated on: Mar 28, 2025 | 5:53 AM

Share

నేటి యువతకు బైక్‌ రైడింగ్‌ చాలా ఇష్టం. కానీ ఈ మండే ఎండలో హెల్మెట్ ధరించి బైక్ నడపడం కష్టమైన పని. ఎండ వేడిలో హెల్మెట్ ధరించడం వల్ల తలకు చెమట పట్టి, అసౌకర్యంగా అనిపిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతుంటారు. ట్రాఫిక్‌ సిబ్బంది చూశారంటే జరిమానా గ్యారెంటీ. అయితే ఎండల్లో చెమటకు చిరాకు పడినా హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వారిని మీరు చూసే ఉంటారు. ఈ వేడి వాతావరణంలో మీరూ ఎలాంటి అసౌకర్యం లేకుండా హెల్మెట్ ధరించి వాహనం నడపాలంటే ఈ కింది సింపుల్ సిట్కాలు ట్రై చేయండి. అవేంటంటే..

  • ఈ వేడి వాతావరణంలో హెల్మెట్ ధరించడం అసౌకర్యంగా అనిపిస్తే, మీ తలకు పలుచని గుడ్డ కట్టుకుని దానిపై హెల్మెట్ ధరించడం మంచిది.
  • మీరు ఎక్కువసేపు హెల్మెట్ ధరిస్తే, హెల్మెట్‌లో చెమట పేరుకుపోతుంది. కాబట్టి మీ జుట్టును కప్పి ఉంచే టోపీ లేదా పలుచని గుడ్డను తలకు చుట్టుకుని హెల్మెట్ ధరించండి. అది చెమటను గ్రహిస్తుంది.
  • వేసవిలో వీలైనంత వరకు బిగుతుగా ఉండే హెల్మెట్ ధరించడం మానుకోవాలి. ఎందుకంటే ఇది గాలి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది మురికి, చెమటను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
  • హెల్మెట్‌ను తరచుగా శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దుమ్ము, ధూళి ఎప్పటికప్పుడు తొలగిస్తే జుట్టుపై దాని ప్రభావం కనిపించదు. కానీ హెల్మెట్‌ను శుభ్రం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టవద్దు. ఇలా చేయడం వల్ల తలలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది.
  • హెల్మెట్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. ఫలితంగా అందులో దుమ్ము పేరుకుపోతుంది. ఒకే హెల్మెట్ ధరించడం వల్ల అలెర్జీలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్‌ పెట్టుకోవడం మంచిది.
  • వేసవిలో హెల్మెట్ లోపల చెమట పేరుకుపోతే హెల్మెట్ దుర్వాసన వస్తుంది. కాబట్టి హెల్మెట్ డియోడరైజర్ ఉపయోగించి శుభ్రం చేయడం మంచిది.
  • జుట్టు తడిగా ఉండగా హెల్మెట్ ధరించకూడదు. ఇది హెల్మెట్ లోపలి పొర, మీ జుట్టు మధ్య ఘర్షణను పెంచుతుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.