Meat Substitutes: ఇవి పేరుకే వెజిటేరియన్ ఫుడ్స్.. రుచిలో మాత్రం అచ్చం నాన్‌వెజ్‌లా.. ఇదెలా సాధ్యమంటే..
చాలామంది నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు. అయితే కొన్ని కారణాల వల్ల మాంసం తినడం కుదరకపోవచ్చు. అటువంటి సమయంలో మీరు అచ్చం నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి. సాధారణంగా మాంసంలో ప్రొటీన్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. మాంసాహారానికి ఆ రుచి రావడంలో ఇవి కూడా కీలకమే. అయితే, కొన్ని శాకాహార పదార్థాల్లో కూడా ఇవే పోషక విలువు ఉన్నప్పుడు అవి కూడా నాన్ వెజ్ రుచితో ఉంటాయి. అవేంటో చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగం ఏటికేడు పెరుగుతోంది. టేస్టీగా ఉండటంతో పాటు ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. అయితే మాంసం తినని వారి పరిస్థితేంటి..? పోషకాలు సమృద్ధిగా లభించాలంటే వీరు కొన్ని శాకాహారాలు తినొచ్చు. ఇవి మాంసానికి మంచి ప్రత్యామ్నాయాలుగా పేరొందాయి. ఆశ్చర్యంగా ఇవి పోషకాల్లోనే కాదు రుచిలోనూ నాన్వెజ్ రుచిని కలిగి ఉంటాయి. వీటికి కొన్ని ప్రత్యేకమైన మసాలాలు వంటివి కలిపి వండినప్పుడు ఇవి అచ్చం మాంసం రుచిని అందిస్తాయి. మరి ఈ లిస్టులో ఉన్న పాపులర్ ఫుడ్స్ ఏవో చూద్దాం.
శనగ పప్పు
శనగపప్పులో ప్రొటీన్ పాళ్లు ఎక్కువే ఉంటాయి. దీన్ని మసాల పప్పుగా తయారు చేసినప్పుడు దీని రుచి అమోఘంగా ఉంటుంది. చికెన్ కు ఉన్న రుచే దీనికి కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇందులో ఉండే ప్రొటీన్ శాతమే అని తెలుస్తోంది.
పుట్టగొడుగులు
మీరు ఉపవాసం లేదా ఏదైనా పూజలో ఉండి, మీ నాలుక నాన్ వెజ్ రుచి కోరుకుంటే పుట్ట గొడుగులు తినడం మంచిది. దీని రుచి కూడ అచ్చం నాన్ నెజ్ లాగే ఉంటుంది. అలాగే ఇందులో ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటుంది.
టోఫు
మొక్కల ఆధారిత ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న మరో వెజ్ ఫుడ్ టోఫు. దీని రుచి కూడా దాదాపు నాన్ వెజ్ లాగే ఉంటుంది. అలాగే మాంసం అందించే అన్ని పోషకాలు అందిస్తుంది.
జాక్‌ఫ్రూట్
జాక్‌ఫ్రూట్‌ను వెజిటేరియన్ మీట్ అని పిలుస్తారు. ఇది అచ్చం మటన్ రుచితో ఉంటుంది. దీనిని చికెన్ కర్రీలాగా వండుకుని తినొచ్చు.
వంకాయ
వంకాయను మంచి మసాలా వేసి వండితే అచ్చం నాన్ వెజ్ వలే ఉంటుంది. అలాగే ఎంతో ఆరోగ్యం కూడా. ఈసారి మీకు నాన్ వెజ్ తినాలని ఉంటే వంకాయ వండేయండి.
పప్పు దినుసులు
మొక్కల ఆధారిత ప్రోటీన్స్ అధికంగా గల మరో ఆహారం పప్పు దినుసులు, నాన్ వెజ్ ఎలాంటి పోషకాలు అందిస్తాయో అవన్నీ ఈ పప్పుల్లో ఉంటాయి. రుచి కూడా దాదాపు నాన్ వెజ్ లాగే ఉంటుంది.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్‌ను సరైన పద్ధతిలో వండితే కచ్చితంగా అది మీకు నాన్ వెజ్ అనుభూతి అందిస్తుంది. దీనిలోని పోషకాలు మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి కూడా.
సియాటన్
దీనిని గ్లుటెన్‌తో తయారు చేస్తారు. సియాటన్ ఫుడ్ అచ్చం పోర్క్ రుచితో ఉంటుంది. అలాగే నాన్ వెజ్‌కు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
సోయా చంక్స్
సోయా ఉత్పత్తుల్లో సోయా చంక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. వీటిని పూర్ మ్యాన్ మీట్ అని కూడా అంటారు. అందువల్ల నాన్ వెజ్ తినాలనిపిస్తే ఇవి తినేయండి.