Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: చికెన్‌ తిన్న తర్వాత పాలు తాగకూడదా..? తాగితే ఏం జరుగుతుందంటే..

మనం తినే ఆహారాలు, తాగే పానీయాలకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. వాటి గురించి మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ చాలా విషయాల్లో లాజిక్‌ తెలుసుకోకుండానే కన్‌క్లూజన్‌కి వచ్చేస్తుంటాం. ఫలితంగా అది నిజమో.. అబద్ధమో పూర్తిగా తెలుసుకునే ఛాన్స్‌ మిస్‌ అవుతుంటాం. అలా కొన్ని విషయాలు తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి. కానీ వాటి వెనుక ఉన్న అసలైన కారణం ఎవరికీ..

Chicken: చికెన్‌ తిన్న తర్వాత పాలు తాగకూడదా..? తాగితే ఏం జరుగుతుందంటే..
Is It Safe To Drink Milk After Chicken
Follow us
Srilakshmi C

| Edited By: TV9 Telugu

Updated on: Jan 05, 2024 | 3:04 PM

మనం తినే ఆహారాలు, తాగే పానీయాలకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. వాటి గురించి మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ చాలా విషయాల్లో లాజిక్‌ తెలుసుకోకుండానే కన్‌క్లూజన్‌కి వచ్చేస్తుంటాం. ఫలితంగా అది నిజమో.. అబద్ధమో పూర్తిగా తెలుసుకునే ఛాన్స్‌ మిస్‌ అవుతుంటాం. అలా కొన్ని విషయాలు తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి. కానీ వాటి వెనుక ఉన్న అసలైన కారణం ఎవరికీ తెలియదు. అలాంటి ఒక అపోహ ఏమిటంటే.. చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదని అంటుంటారు. ఎందుకంటే మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగడం వల్ల శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, అందుకే చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదని చెబుతారు. అయితే దీని వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ & ఎస్. ఎస్. ఆసుపత్రి మెడిసిన్ విభాగం హెచ్.ఓ. డి డాక్టర్ ఎల్. హెచ్.ఘోటేకర్ ఏం చెబుతున్నారంటే.. మటన్ తిన్నాక భేషుగ్గా పాలు తాగొచ్చు. ఎందుకంటే వీటి రెండింటి మధ్య ఎలాంటి ప్రతికూల సంబంధం లేదు. వీటి కలయిక వల్ల ఎలాంటి ప్రతికూల ప్రతిచర్యలు జరిగినట్లు శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి.. ఈ రెండింటిలో అధిక మొత్తంలో ప్రోటీన్‌ ఉంటుంది. అందువల్ల చికెన్, మటన్ తిన్న తర్వాత పాలు తాగితే ఆరోగ్యానికి మేలేగానీ ఎలాంటి సమస్యలు తలెత్తవని డాక్టర్‌ ఘోటేకర్ చెబుతున్నారు. అదేవిధంగా.. చాలా మంది ఆల్కహాల్ సేవించిన తర్వాత వెంటనే పాలు తీసుకోకూడదని చెబుతుంటారు. కానీ వెంటనే కాకుండా కొంత సమయం తర్వాత పాలు తీసుకోవచ్చని ఘోటేకర్ అంటున్నారు. ఎందుకంటే మద్యం సేవించిన తర్వాత పాలు తీసుకోవడం వల్ల ఆమ్లత్వం తగ్గి ఆరోగ్యానికి సహకరిస్తుంది. అందువల్ల, ఆల్కహాల్ తర్వాత పాలు తాగకూడదు అనేది కూడా పూర్తి అపోహ మాత్రమేనని ఆయన కొట్టి పారేశారు.

అయితే కొంత మందికి పాల ఉత్పత్తులు, మాంసాన్ని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కొందరికి జీర్ణశక్తి పరిమితంగా ఉండడం వల్ల ఒకేసారి అంతగా జీర్ణం అవ్వదు. దీనివల్లనే జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు వస్తాయి. అయితే ఈ రెంటినీ కలిపి తినడం వల్ల వచ్చే రియాక్షన్‌కి.. దీనిని లింక్ చేయడం తగదు. అదేవిధంగా పుల్లని పండ్లు తిన్న తర్వాత పాలు తీసుకోవడం వల్ల మాత్రం కొన్ని సమస్యలు వస్తాయట. కాబట్టి నారింజ, నిమ్మ, పైనాపిల్ వంటి పుల్లని పండ్లు తిన్న తర్వాత వెంటనే పాలు తాగడం మానుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.