- Telugu News Photo Gallery Health Benefits Of Peanuts: Check Out Why You Should Eat Peanuts In Winter
Benefits Of Peanuts in Winter: వీటిని రోజూ గుప్పెడు తింటే చలిని తట్టుకోవడం సులువే.. శరీరాన్ని వెచ్చగా ఉంచి..
వేరుశెనగ పప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈగింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వీటిల్లో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతాయి. వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది గుండెకు చాలా మంచిది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో మీరు దీన్ని తినవచ్చు..
Updated on: Jan 05, 2024 | 12:50 PM

వేరుశెనగ పప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈగింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వీటిల్లో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతాయి. వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది గుండెకు చాలా మంచిది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో మీరు దీన్ని తినవచ్చు. అంతే కాకుండా చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు వేరుశెనగలు సహాయపడతాయి.

శీతాకాలంలో అల్సామి సమస్య కూడా పెరుగుతుంది. అలసినట్లు అనిపించడం, నిద్రమత్తుగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తే తక్షణ శక్తి కోసం కాసిన్ని వేరుశెనగ పలుకులు తింటే సరి. అంతే కాకుండా శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని కూడా ఇవి భర్తీ చేస్తాయి.

శీతాకాలంలో వేరుశనగలు తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చలికాలంలో ప్రతిరోజూ ఈ గింజలు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. ఈ గింజలు ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి.

ఇందులో ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇవి చలికాలపు అలసట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వైద్య పరిభాషలో దీనిని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) అంటారు. వేరుశెనగలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది.





























