నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌కు చెందిన చిన్న సాయిలు అనే రైతు, రూ. 2,08,500 విలువైన నకిలీ నోట్లతో క్రాప్ లోన్ కట్టేందుకు బ్యాంకుకు వెళ్లాడు. క్యాషియర్ నోట్లను గుర్తించడంతో సాయిలు పారిపోయాడు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్ల ముఠాల ఆగడాలు ఇది కొత్తేమీ కాదు.