బాహుబలి2, ట్రిపుల్ ఆర్ చిత్రాలతో ఫస్ట్ డే హండ్రడ్ క్రోర్స్ టచ్ చేశారు రాజమౌళి. ఆయన దారిలోనే ప్రశాంత్ నీల్, అట్లీ, సుజీత్, లోకేష్, సందీప్ రెడ్డి వంగా అంటూ మన వారు ట్రావెల్ చేశారు. అక్కడిదాకా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఈ లిస్టులో పేరు చూసుకోవాలనుకుంటున్న కెప్టెన్ల గురించి ఆరా తీస్తున్నారు జనాలు. స్టార్ డైరక్టర్ శంకర్ ఇండియన్2, గేమ్ చేంజర్ సినిమాల మీద ఫోకస్ గట్టిగా ఉంది.