- Telugu News Photo Gallery Cinema photos After Guntur Karam, fans are waiting for the news of who is the hero who will turn towards Trivikram
Trivikram: గుంటూరు కారం తర్వాత గురూజీ దారెటు.. ఏ హీరోను డైరెక్ట్ చేయనున్నారు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఏ చిన్న విషయం లీక్ అయినా, దాని చుట్టూ ఉన్న అందరి గురించీ వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తో అట్లీ నెక్స్ట్ సినిమా అనే మాట అలా స్టార్ట్ అయిందో లేదో, మరి త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి? ఆయన డైరక్ట్ చేయడానికి స్కోప్ ఉన్న హీరోలెవరూ అంటే రకరకాల ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. తన నెక్స్ట్ సినిమాతో ప్యాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అవుతున్నారు స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్.
Updated on: Jan 05, 2024 | 12:42 PM

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఏ చిన్న విషయం లీక్ అయినా, దాని చుట్టూ ఉన్న అందరి గురించీ వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తో అట్లీ నెక్స్ట్ సినిమా అనే మాట అలా స్టార్ట్ అయిందో లేదో, మరి త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి? ఆయన డైరక్ట్ చేయడానికి స్కోప్ ఉన్న హీరోలెవరూ అంటే రకరకాల ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.


2023లో దసరా, హాయ్ నాన్నతో సక్సెస్ అందుకున్నారు నాని. ఈ మధ్య హాయ్ నాన్న ప్రమోషన్లలో భాగంగా మల్టీ స్టారర్ చేయడానికి మీరు రెడీయేనా అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు 'త్రివిక్రమ్ గారూ... వింటున్నారా?' అంటూ స్పందించారు నాని. అప్పటి నుంచి, త్రివిక్రమ్ డైరక్షన్‌లో నాని నెక్స్ట్ ప్యాన్ ఇండియా సినిమా ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే టాక్ వైరల్ అవుతోంది.

అటు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో కోసం కూడా జనాలు ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడి డైరక్షన్‌లో తారక్ నటిస్తే ఎలా ఉంటుందో అరవింద సమేతలో చూశాం. మళ్లీ అంతకు మించిన సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు జనాలు.

ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న తారక్, ఆ వెంటనే వార్ సీక్వెల్ షూటింగ్‌కి హాజరవుతారు. మరి అక్కడి నుంచి వచ్చాక త్రివిక్రమ్‌తో సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారా? ఆల్రెడీ ఈ కాంబోకి స్క్రిప్ట్ రెడీగా ఉందా? సడన్‌గా వార్తల్లోకి వచ్చిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఇది. ఆఫ్టర్ గుంటూరు కారం గురూజీ వైపు మొగ్గే హీరో ఎవరన్న వార్త కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ మరి.




