- Telugu News Photo Gallery Cinema photos Actress Vaishnavi Chaitanya Birthday special posters release in social media Telugu Actress Photos
Vaishnavi Chaitanya: బేబీ టైమ్ స్టార్ట్స్.. ఇక చూస్కోండి నా సామిరంగా.! వరసబెట్టి సినిమాలే..
ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంత ఈజీగా అవకాశాలు రావు.. వచ్చినా ఏదో లక్‌లో ఒకట్రెండు ఛాన్సులు వస్తాయేమో కానీ ఒకప్పట్లా మాత్రం ఇండస్ట్రీలో పదికాలాల పాటు గుర్తుండిపోయే అవకాశాలు మాత్రం రావు అనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తుంది. అయితే ఈ మధ్య కొందరు తెలుగు బ్యూటీస్ ఈ నానుడికి చెక్ పెడుతున్నారు. వచ్చి తమదైన టాలెంట్ చూపించడమే కాకుండా.. స్టార్ హీరోయిన్లు కూడా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల దూకుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య సైతం అదే దూకుడు చూపిస్తుంది.
Updated on: Jan 04, 2024 | 10:16 PM

ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంత ఈజీగా అవకాశాలు రావు.. వచ్చినా ఏదో లక్‌లో ఒకట్రెండు ఛాన్సులు వస్తాయేమో కానీ ఒకప్పట్లా మాత్రం ఇండస్ట్రీలో పదికాలాల పాటు గుర్తుండిపోయే అవకాశాలు మాత్రం రావు అనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తుంది.

అయితే ఈ మధ్య కొందరు తెలుగు బ్యూటీస్ ఈ నానుడికి చెక్ పెడుతున్నారు. వచ్చి తమదైన టాలెంట్ చూపించడమే కాకుండా.. స్టార్ హీరోయిన్లు కూడా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల దూకుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య సైతం అదే దూకుడు చూపిస్తుంది.

నిజానికి బేబీ తర్వాత ఈమెకు కోరుకున్న అవకాశాలు రావట్లేదనే టాక్ కూడా వినిపించింది. ఎందుకు ఈమెపై చిన్నచూపు చూపిస్తున్నారంటూ చర్చ కూడా జరిగింది. కానీ అసలు సీన్ మాత్రం మరోలా ఉంది. ఈ బేబీకి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఏకంగా 5 సినిమాలకు సైన్ చేసింది వైష్ణవి చైతన్య.

ఈ సందర్భంగా ఈమె నటిస్తున్న సినిమాల డీటైల్స్ అన్నీ బయటికి వస్తున్నాయి. అందులో పెద్ద బ్యానర్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఓ బ్లాక్‌బస్టర్ సినిమా వస్తే.. అందులో హీరోయిన్ పంట పండినట్లే. ఇప్పుడు వైష్ణవి విషయంలోనూ ఇదే జరుగుతుంది.

కాకపోతే బేబీ తర్వాత నెక్ట్స్ ఆఫర్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ బేబీ. కొన్నిసార్లు నిదానమే ప్రధానం అంటారు కదా.. అలాగే సాగిపోతుంది బేబీ కెరీర్. బేబీలో తనదైన నటనతో పిచ్చెక్కించింది వైష్ణవి. ఆ సినిమా సంచలన విజయంలో వైష్ణవి చైతన్య పాత్ర మరవలేం.

ఒక్క సినిమాతోనే వైష్ణవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తాజాగా ఈమె 5 సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. అందులో రెండు సెట్స్‌పైనే ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న సినిమాతో పాటు..

దిల్ రాజు నిర్మాతగా ఆశిష్ రెడ్డి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట తమ్ముడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలోనూ వైష్ణవి హీరోయిన్‌గా నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో ముస్లిం అమ్మాయిగా నటిస్తుంది ఈ భామ.

ఈ రెండు సినిమాలతో పాటు మరో మూడు సినిమాల్లోనూ వైష్ణవి పేరు పరిశీలిస్తున్నారు. గ్లామర్ షోకు ఎలాంటి అడ్డు చెప్పదు కాబట్టి ఈ భామకు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం SVCC, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాణ సంస్థల నుంచి వైష్ణవికి ఆఫర్స్ వచ్చాయి.

దాంతో పాటు బేబీ నిర్మాతలతో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉండనే ఉంది. ఇవే కాదు.. బయటి సంస్థల నుంచి కూడా బేబీకి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఎలా యూజ్ చేసుకుంటుందనే దానిపైనే ఈమె కెరీర్ ఆధారపడి ఉంది.




